సామాజిక స్పృహ కలిగించే ఖయ్యుం కొడుకు
చాలా సులభమైన విధంగా చాలా అర్థవంతంగా ఇందులో మొత్తం 15 కథలు ఉన్నాయి. ప్రతి కథ తాత్వికచింతనతో కూడుకున్నది. ప్రతి కథలో రాజకీయాలు ఉంటాయి. మత రాజకీయం, ఎన్నికల రాజకీయం, కుల రాజకీయం, ప్రేమ రాజకీయం, సాహిత్య రాజకీయం, అనేక కోణాలలో అన్ని రకాల రాజకీయాలు మనకు ఈ కథలో కనిపిస్తాయి. దేశంలో రాజకీయం ఏ వైపుగా సాగుతుందో ఆ రాజకీయం వల్ల జరిగే అనర్ధం ఎంతగా జరుగుతుందో ఫాసిజాన్ని ఎంత వేగంగా విస్తరింపజేస్తున్నారో నియంత ప్రజల ఆలోచనలను ఏ వైపుగా డైవర్ట్ చేస్తున్నారో, ఎన్నికలలో గెలుపు ఓటముల మధ్య జరిగే విధానం కూడా EVM ను, అక్కడున్న










