పురా జ్ఞాపకంలా మంగలిపల్లె
కథలు జీవన విధానాల, అనుభవాల, ఎన్నెన్నో సంఘటనల నిదర్శనాలు. కాలగర్భంలో కలిసిపోయిన ఊరు, అక్కడి జీవన సారాంశాలను నరేష్కుమార్ సూఫీ తనదైన పాత్రను పోషిస్తూ రాసిన కథలు 'మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె'గా రూపం దాల్చుకున్నాయి. రచయిత తన చిన్నతనాన్ని వెతుక్కుంటూ మళ్ళీ ఓ సారి వాళ్ల ఊరికి వెళ్ళి బాల్యాన్ని, బడిని... ముఖ్యంగా అక్కడి పరిస్థితులను ఇలా అన్నింటిని గుర్తుచేసుకుంటూ వివరిస్తున్న విధానం పాఠకులందరినీ కూడా వాళ్ళ చిన్నతనాన్ని నెమరువేసుకునేలా చేస్తాయి. కథల్లో ఓ ప్రతిస్పందన, వెతుకులాట ఉంటుంది. అది రచనా పరిణితిని బట్టి కథల అనుభూతి ఉంటుంది. ఈ పుస్తకంలోని కథలు చాలా చోట్ల మనల్ని అక్కున




