ఆమె చేసిన చర్చ మెట్ల మీద ఆగిపోలేదు
మన సమాజంలో మహిళ నిర్మాణమయ్యె క్రమం ప్రత్యేకమైనది. పురుషుడి నిర్మాణ క్రమానికి భిన్నమైనది. పురుషుడితో సమానమైన స్వేచ్ఛ, సొంత అభిప్రాయాల ప్రకటన ఈ నిర్మాణక్రమంలో నిషేధం. అణచివేతలు, ఆంక్షలు ఈ నిర్మాణక్రమానికి ఉన్న ప్రత్యేకతలు. సహజంగానే సమాజంలోకి వచ్చిన ప్రతి మహిళా ఈ నిర్మాణ క్రమం నుండి వేరుపడదు. వేరుపడాలని ప్రయత్నించినా సమాజం అంగీకరించదు. కానీ అట్లాంటి నిర్బంధ క్రమాన్ని బద్దలు కొట్టే సామాజిక చైతన్యం తెచ్చుకున్న స్త్రీలు సమాజంలో ఉంటారు. వీరే సమాజాన్ని నూతన ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. ఏ ఆంక్షలు లేని ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి తీవ్రమైన సంఘర్షణ పడతారు. ఆ ప్రయాణంలో భాగంగా నూతన మానవులుగా










