మాట్లాడే పుస్తకాలు
పుస్తకాలను చదవకుండా పుస్తకాలను తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు.పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా అలా..










