మహారాష్ట్రలో ముస్లింలకు న్యాయం ఎండమావియేనా?
గడిచిన జూలై నెలలో బొంబాయి హైకోర్టు, స్పెషల్ సెషన్స్ కోర్టు రెండు బాంబు పేలుళ్ల కేసుల్లో రెండు ఆసక్తి దాయకమైన తీర్పులు ఇచ్చాయి. రెండిరట్లోనూ ప్రాసిక్యూషన్ ముద్దాయిలు నేరం చేశారని నిరూపించలేకపోవడం వల్ల నిర్దోషులుగా విడుదలయ్యారు. మొదటిది 7/11 వరుసగా రైళ్లలో బాంబులు పేలిన కేసు. అందులో 189 మంది చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. అది 2006 జూలై 11న జరిగింది. ఏ.టి.ఎస్. గా పిలిచే యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ కేసులో విచారణ చేపట్టింది. 19 సంవత్సరాలు హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఇందులో ఒకరు 2017 లోనే నిర్దోషిగా విడుదలై మిగతా 12 మంది మహారాష్ట్రలో పూనే,










