వ్యాసాలు

వాతావరణ మార్పు, భవిష్యత్తు

కర్బన ఉద్గారాల వలన ఏర్పడిన భూతాపం, దీని కారణంగా ఏర్పడుతున్న మార్పుల మొత్తాన్ని, వాతావరణ మార్పు అంటాం. ఈ మార్పును వాతావరణ శాస్త్ర సహాయంతో అర్థం చేసుకుంటూ, ఒక అవకాశంగా తీసుకుని సరైన విధంగా మలుచుకోగలిగితే మానవాళి పరిరక్షణకు సుస్థిర భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.      కర్బన ఉద్గారాలు పరిమితి దాటి పెరగడం మూలాన, ఈ వాయువులు విపరీతంగా పెరిగి భూమి ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరుగుతుంది. భూ ఉపరితల ఉష్ణోగ్రత 19వ శతాబ్దంలో 1.1°c ఉండింది. గత 40 సంవత్సరాలలో భూతాపం బాగా పెరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్: 2015లో ప్రపంచ దేశాలు (ఐక్యరాజ్యసమితి లోని సభ్య దేశాలు) ఐక్యరాజ్యసమితి వాతావరణ
వ్యాసాలు

‘కల్చరల్ నాటో’ యుద్ధం: సంచలన శోధన

(మ‌నీష్‌ ఆజాద్ అలహాబాద్ నివాసి. రచయిత, కవి, సామాజిక కార్యకర్త. ఆయన ఈ వ్యాసం ఈ రోజు జన చౌక్ వెబ్ పత్రికలో వచ్చింది. విరసం సంస్థకు కాలం చెల్లిందని ఒకరు, విరసం దిక్కు మార్చుకోవాలని మరొకరు సలహాలనిస్తున్న సందర్భంలో సాంస్కృతిక  రంగంలో  విప్లవ కర్తవ్య బాట నుంచి తప్పించడానికి సామ్రాజ్య వాదం చేసిన కుట్రలను ఎండగట్టిన పుస్తకాలను మీ ముందుకు తీసుకురావటం అవసరమని భావించి ఈ వ్యాసాన్ని అనువదించి  మీ ముందు ఉంచుతున్నా.. అనువాద‌కుడు) గత నెల ఆగస్టు 31న బ్రిటిష్ రచయిత్రి ఫ్రాన్సెస్ స్టోనర్ సాండర్స్ (Frances Stonor Saunders) బ్రెయిన్ ట్యూమర్‌తో కన్నుమూశారు. ఆమె
వ్యాసాలు

అవిస్మృత యాత్రికుడు రాహుల్జీ

బెంగాల్ రాష్ట్రంలోని రాణిగంజ్ లో ఉన్న రాహుల్ సాంకృత్యయన్ విగ్రహాన్ని ఎవరో రాత్రికి రాత్రే కూల్చి, ఆనవాలు లేకుండా చేసారు. అంత ద్వేషం దేనికి రాహుల్జీ మీద? ఎవరీ అకృత్యానికి పాల్పడ్డారు!   మహాపండితుడు రాహుల్ సాంకృత్యయన్ విగ్రహాన్ని కూల్చిన దుండగులు... ఒక అభ్యుదయవాది, హేతువాది, ప్రజాస్వామిక వాది, స్వేచ్ఛాపిపాసి, స్వాతంత్య్రపోరాట యోధుడు, మార్క్సిస్టు ఆలోచనాపరుడు, చరిత్రకారుడు, బహుగ్రంథ రచయిత, భారతీయ మేధావులలో అగ్రగణ్యుడైన రాహుల్ తన జీవితకాలమంతా చేసిన సాహిత్య, చారిత్రక, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని చెరపలేరు. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చినదెవరో, వారి అనుయాయులే రాహుల్ విగ్రహాన్ని కూల్చారు. విగ్రహాలను కూల్చేసి కమ్యూనిస్టు సైద్ధాంతికతను నిర్మూలించగలరా? తిరిగి
వ్యాసాలు

ప్రపంచ చరిత్ర ఎందుకు చదవాలి-3

సామ్రాజ్యవాదం చరిత్ర గురించి చదవడం ఇంటా బయటా పచ్చి దోపిడీ, వాటిలో వాటికి పోటీ, ఒక దేశం పతనం చెంది మరోటీ కొత్తగా రావడం ఇవన్నీ కూడా సామ్రాజ్య వాదపు లక్షణాలు. అందుకే లెనిన్ సామ్రాజ్యవాదాన్ని'కృషించిపోతున్న పెట్టుబడిదారీ విధానం'గా వర్ణించాడు. అప్పుడే శ్రామిక సామాజిక విప్లవం తొలిదశ మొదలవుతుంది. సామాజిక వైరుధ్యాల మూలంగానే పెట్టుబడిదారీ విధానం పతనమై తీరుతుంది. సోషలిజం విజయవంతం అవుతుంది. చారిత్రక ఉద్యమ సూత్రాలే వీటన్నిటిని నిర్ణయిస్తాయి. క్షీణ పెట్టుబడి దారీ విధానపు వినాశ విపరీత బుద్ధులు సామ్రాజ్యవాద దశలో నగ్నంగా కనబడతాయి. అంతర్గత వైరుధ్యాలు కొట్టొచ్చినట్టుగా బయటపడతాయి. వైరుధ్యం  తీవ్రతర మయింది. గుత్త పెట్టుబడిదారీ
వ్యాసాలు

సజీవ కొండలను శూన్యంగా మార్చే బాక్సైట్ తవ్వకం

2026 సెప్టెంబర్ 7 ‘‘గనులను లీజుకు ఇచ్చిన ప్రాంతంలో ఎలాంటి సహజ నీటి వనరులు లేవు అని చెట్ల లెక్కింపు నివేదికలో పేర్కొన్నారు..., మన వద్ద కేవలం 2933 చెట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది’’ అని సిజిమాలి కొండలలో మైనింగ్ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాల గురించి ఒక డాక్యుమెంటరీ కోసం ప్రశ్నించినప్పుడు వేదాంత (బహుళజాతి మైనింగ్; లోహాల సంస్థ) అధికారి అన్నారు. ఈ ప్రకటనలోని అంతరార్థం ఏమిటంటే, ఆ ప్రాంతంలో అడవులు, నీటి వనరులు లేవు కాబట్టి, ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ఆ ప్రాంతానికి ఎలాంటి పర్యావరణ ముప్పును కలిగించదు. బాక్సైట్ మైనింగ్ పట్ల ఉన్న
వ్యాసాలు

బెయిల్ నియమం, జైలు మినహాయింపు:రాజ్యాంగ వాగ్దానం; ప్రభుత్వ అణచివేత – వాస్తవికత

30/08/2026 భారతదేశ నేర న్యాయ వ్యవస్థలో, బెయిల్ సమస్య ఇకపైన కేవలం ఒక విధానపరమైన, చట్టపరమైన విషయం మాత్రమే కాదు; ఇది రాజ్యం, పౌరుడి మధ్య ఉండే సంబంధానికి అత్యంత కీలకమైన పరీక్షలలో ఒకటిగా నిలుస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం హామీ ఇస్తుంది. బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు; విచారణలో ఉన్న ఖైదీని దోషిగా పరిగణించకూడదు; అనవసరమైన న్యాయ జాప్యం జరగడం అంటే ఆ వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించడమే అని సుప్రీం కోర్టు పదేపదే పునరుద్ఘాటించింది.  "ఆలస్యమైన న్యాయమే ఎలా ఒక శిక్షగా మారుతుందో" వివరించే కొన్ని సంఘటనలు రచయిత ఈ వ్యాసంలో
వ్యాసాలు

అక్షరాలు నా ఆనవాళ్లు – ఆకుల మల్లేశ్వర రావు

"జీవితంలో పుస్తక పఠనం చాలా ముఖ్యం." 1. నాకు ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క ఉండడం వల్ల అన్నయ్యల ద్వారా వారి స్నేహితుల ద్వారా నాకు దిన వార పత్రికలు చదవడం అలవాటయింది ఆంధ్రప్రభ వార పత్రిక మా అన్నయ్య తెప్పిస్తుండేవాడు. వాటిలో కార్టూన్ లు కథలు సీరియల్స్ ప్రముఖ రచయితలు రచయితలవి చదవడం అలవాటయింది. చిన్న వయసులోనే ఆ అలవాటు కొనసాగింది. 2. పుస్తకాలను చదవడం వల్ల మరిన్ని పుస్తకాల పరిచయము వాటి గురించిన అవగాహన కలుగుతూ ఉండేది ముఖ్యంగా నేను నేషనల్ బుక్ ట్రస్ట్ కావచ్చు సాహిత్య అకాడమీ కావచ్చు వాటి ప్రచురణలు అలాగే, వివిధ
వ్యాసాలు

శక్తివంతమైన పౌర రక్షణ దళం ఎందుకు?

ఆగస్టు 15 ఉపన్యాసంలో మోదీ దేశ ప్రజలనుద్దేశించి తమ ప్రభుత్వం, సాయుధ నక్సల్స్/మావోయిస్టుల ప్రమాదాన్ని నిర్మూలించాం కానీ దిమాగీ నక్సల్స్ (మేధావి నక్సల్స్)మిగిలే ఉన్నారని, భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతి కృషి నుండి దేశ యువతను పక్కదారి మళ్ళించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అసమ్మతి గళాలపై, సమూహాలపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మావోయిస్టు సిద్ధాంతాలతో ప్రభావితమైన వారు ఏళ్ళుగా దేశంలోని గత ప్రభుత్వ యంత్రాంగంలో పాతుకుపోయారు. ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా పనిచేశారు. ఈ సంక్షోభం నుంచి దేశానికి విముక్తి కల్పించాం. అడవుల్లో ఉన్న సాయుధ నక్సలైట్లను తుదముట్టించడంలో విజయం సాధించాం. అయితే మేధో
వ్యాసాలు

ప్రపంచ చరిత్ర ఎందుకు చదవాలి రెండవ భాగం

(స‌వ‌ర‌ణ-వివ‌ర‌ణ:  ప్ర‌పంచ చ‌రిత్ర ఎందుకు చ‌ద‌వాలి అనే శీర్షిక‌తో  గ‌త సంచిక‌లో కె.వి.ఆర్. ర‌చ‌న‌గా ఒక ర‌చ‌న‌ను ప్ర‌చురించాం. సృజ‌న‌ 1978 జ‌న‌వ‌రిలో అచ్చ‌యిన ఈ ర‌చ‌న కె.వి.ఆర్ సాహిత్య స‌ర్వ‌స్వంలో పొర‌బాటున  పున‌ర్ముద్ర‌ణ కావ‌డంతో వ‌సంత‌మేఘంలోకి కూడా అట్లాగే వ‌చ్చింది. ఆ త‌ర్వాత తిరిగి చూసుకుంటే ఇది నిజం కాద‌ని తేలింది. ప్రపంచ చరిత్ర ఎందుకు చదవాలి? అనే ఈ శీర్షిక‌తో సృజ‌న‌లో అచ్చ‌యిన‌ది అనువాద వ్యాసం. దీని మూలం   చైనా ప‌త్రిక ‘పెకింగ్ రివ్యూ’ లో అచ్చ‌యింది. ఈ పెద్ద వ్యాసం అనువాదాన్ని సృజ‌న 1978 జ‌న‌వ‌రి నుంచి నాలుగు సంచిక‌ల్లో సీరియ‌ల్‌గా ప్ర‌చురించింది. అమ‌రుడు
వ్యాసాలు

పుస్తకం నేను మనిషిగాఎలా జీవించాలో నేర్పింది – మారుతి పౌరోహితం

మారుతి పౌరోహితం స్వస్థలం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే గువ్వలదొడ్డి అనే చిన్నగ్రామం. పౌరోహిత్యం, వ్యవసాయం చేసుకునే కుటుంబం నుండి వచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణా కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా  పనిచేస్తున్నారు.  “పునరపి ” తొలి  కథ(2016).  “ఊరిమర్లు” “ఇల్లిడిసిన తొమ్మిది కథలు” కథా సంపుటాలు, “ప్రణయ హంపీ” చారిత్రక కాల్పనిక నవల ప్రచురించారు. మారుతి పౌరోహితం రాయలసీమ మట్టివాసనను, అక్కడి మనుషుల జీవితాలను, వారి భాషను, వారి బాధలను, బతుకు పోరాటాలను తన రచనల్లో ఆవిష్కరించే కథారచయిత, నవలాకారుడు. పుస్తక పఠనాన్ని తన సాహిత్య ప్రయాణానికి పునాదిగా చేసుకున్న ఆయన,