లందలో పొడిచిన రాడికల్ సూర్యుడు “కర్రెం నర్సప్ప”
నల్లమల విప్లవోద్యమం ఏమి మిగిల్చుకోలేదని అది ఒక పరాజిత గాథ అని మాట్లాడే మేధావులు చాలా మందే ఉన్నారు సమాజంలో. నిజానికి నల్లమల ఉద్యమం ఏమి మిగిల్చుకోలేదా! సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదా?అది ఓడిపోయిన కథ మాత్రమేనా? ఎందుకని సో కాల్డ్ మేధావులకు ఈ వివక్ష? ఉత్తర తెలంగాణ,విప్లవోద్యమాన్ని రొమాంటిక్ గా గంటలు గంటలు ఎత్తిపాడుతూ, ఉపన్యాసాలు దంచే వారికి నల్లమల్ల విప్లవోద్యమం ఎందుకని చిన్నగా కనిపిస్తుందో వింతగా తోస్తుంది. బహుశా నేను అనుకుంటాను నల్లమల్ల విప్లవోద్యమంలో మొదటి తరాన్ని మినహాయిస్తే ఆ విప్లవోద్యమం సెట్ బ్యాక్ గురయ్యేవరకు దళితుల ముఖ్యంగా మాల మాదిగల కొందరు బీసీల










