ప్రజా యుద్ధమే కా. హన్మంతు జీవన సందేశం
మావోయిస్టు పాక హన్మంతు అంత్యక్రియలకు పదిహేను వేల మంది వచ్చారని పత్రికలు రాశాయి. ఈ మాటకు మీలో కొందరైనా 'ఆఁ వస్తార్లెండీ, చనిపోయినప్పుడు. చివరిసారి చూద్దామని. ఆదేమీ ఆ ఉద్యమ బలం కాద'ని అంటారు. అందులో ఏ అర్థమూ లేదని అంటారు. ఇంత జన సందోహం ఆయనకు వీడ్కోలు పలికిందని అంటే 'మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నార'నే మేధావులు మీలో ఉంటారు. జీవితం, మరణం అవిభాజ్యమనే ఎరుక ప్రజలకు ఉంటుందని అంటే, 'సిద్ధాంతం గురించి మాట్లాడకుండా ప్రజల కామన్సెన్స్ చూసి సంతృప్తి చెందుతున్నార'ని అనే వాళ్లు మీలో తప్పక ఉంటారు. ఇంతకూ ప్రజల్లో ఎవరు ఉన్నారు? వాళ్ల మనో ప్రపంచాన్ని










