తల్లీ కొడుకుల మరణానంతర తలపోత
ప్రజా యుద్ధంలో ఉన్న ఆ కొడుక్కు తల్లి మరణవార్త ఎప్పటికో తెలిసింది. ఆ విషాదాన్ని, దాని చుట్టూ ఉన్న సొంత అనుభూతులను, విప్లవోద్యమ అనుభవాలను కలిసి ఆ కొడుకు ఈ వ్యాసం రాసి వసంత మేఘానికి పంపాడు. కానీ ఇది మాకు చేరి ప్రచురించేనాటికి ఆయన కూడా అమరుడయ్యాడు. ఆ తల్లి భీమరాజు. ఆ కొడుకు చీమల నర్సయ్య అలియాస్ జోగన్న. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బయ్యారం. ఆపరేషన్ కగార్లో ఏప్రిల్ 30, 2024 న అబూజ్మాడ్ (టేకెమెట) ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు. నిరుపేద దళితురాలైన ఆ తల్లి కన్నగచాట్లుపడి పెంచి పెద్ద చేసుకున్న కొడుకు విప్లవంలోకి వెళ్లాక ఆమె