మిరాకిల్
తిరుపతి ఎండలు ఎట్ట ఉంటాయో తెలుసు కదా? నెత్తి మీద గుడ్డు పెడితే ఆమ్లెట్ అయిపోద్ది. ఆ ఎండలో, మనోజ్ గాడు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర టీ కొట్టు కాడ నిలబడున్నాడు. వాడి జేబులో చిల్లిగవ్వ లేదు. అకౌంట్లో చూస్తే రూ. 2700 కూడా లేవు. ఇంటి ఓనర్ ఏమో పొద్దున్నే వచ్చి, "అద్దె కడతావా, సామాన్లు బయట ఇసిరేయమంటావా?" అని దబాయించి పోయినాడు. మనోజ్ రూమ్లో పాత బీరువా మీద ఒక చీటీ అంటించున్నాడు. దాని మీద "బతుకుతావా? లేక అడుక్కుతింటావా?" అని రాసుంది. ఇదంతా ఎవరి పుణ్యం అంటే... మన ‘శ్రీకాంత్ మాస్టర్’ది. ఈ శ్రీకాంత్










