ఉక్కుకోట
(పడ్కల్ స్వామిగా పేరుగాంచిన ప్రభాకర్ సాహసోపేత అనుభవం మీద అమరురాలు కా. రేణుక రాసిన కథ ఇది. ఆయన అమరత్వం సందర్భంగా పునర్ముద్రణ- వసంతమేఘం టీం) కుడి చేతిల ప్లాస్టిక్ లోటతోటి నీళ్లు పట్టుకొని నడుస్తాంది రాజవ్వ. చూస్తే దొడ్డికి పోతున్న దానిలెక్క వుంది. యాభై యేండ్ల వయసుండొచ్చామెకు. శాయనలుపుతోటి ఎత్తుగా, ఎత్తుకు తగ్గ దొడ్డుతోటి వుంది. ఇంచుమించు సగం నెత్తి నెరిసింది. కొంచెం దూరం నుంచి ఆమెనే అనుసరించి నడుస్తున్నడు స్వామి. సుమారు వ•ప్పయ్యేండ్ల వయసుతోటి, బక్కపలుచగ పొట్టిగ ఉన్నడాయన. అంగీ తొడుక్కొని, దోతీ కట్టుకున్నడు. కాళ్లకు చెప్పుల్లేవు. నెత్తిమీద గొంగడి కప్పుకొని దానిమీద ఒక బస్త










