కవిత్వం

సట్లెజ్ గాలి

ఎగసిపడి పరుగెత్తుతూ నువు చెయ్యి ఊపినప్పుడు నీ చేలాంచలం అంచు చూసి నా హృదయం కదిలిపోయింది నిన్ను నేను నా శ్వాసలో చూసాను నా కౌగిలిలో రాజభవనాల దుర్గంధ వాసన నీ స్వచ్ఛమైన ఆత్మను స్పృశించలేదు లాహోర్ జైల్లో ఉరితీయబడిన అమరులను తమ విషాద హృదయాలలో దాచుకున్న తీరాలలో నువ్వు పెరిగావు ఇక్కడ ప్రతి ఉదయమూ, మధ్యాహ్నము రాత్రి దు:ఖంలో తడిసిపోయాయి నీ జలాల నుంచి నడచిపోతున్న పసులకాపర్ల పాటలు ఇక్కడినుంచి ఎలుగెత్తుతున్నాయి నీ ఎగురుతున్న పైట అంచులు (తెరచాపలై)నన్ను భావోద్వేగాల ద్వీపానికి చేరుస్తాయి గోధుమ పొలాలలోని చెట్ల ఆవేదనలో నల్లతుమ్మ పూలసువాసనలోనిన్ను చూసాను నువ్వు సదా చాలా
కవిత్వం

నిరంతరాయం

ఈ నేల నేలంతా దుఃఖ నదులే ప్రవహించి ఉండవచ్చు అద్భుతమైన మనుషులు కొందరు మాయమై ఇక కనిపించకనూ పోవచ్చు కానీ మరుక్షణం నుంచే కదా వాళ్ళు మన హృదయాల్లో పురుడు పోసు కుంటున్నది వాని రక్తపు కూటి ఏలుబడికి స్మశాన వైరాగ్యమే వినబడుతూ ఉండవచ్చు అవకాశవాదాలై కొన్నైనా భిన్న స్వరాలు పురివిప్పనూ వచ్చు చరిత్రకు ఇది కొత్తేమీ కాదుకద!తరతరాల దుఃఖపు కన్నీటి బిందువులే ప్రవహించీ ప్రవహించీ అనంతమైన సముద్రమయ్యాకఅనితరమైన అమరత్వమే కదా ఆవిరై మేఘమై పునరావృత మయ్యేదిప్రతీఘాతానికిఓటమి లేనిదెన్నడు?దొంగ దెబ్బలు దగ్గరి దారులు గమ్యానికి చేర్చిందెప్పుడు ఈ చీకటికి చెల్లుచీటీ నమోదు చేయడమే కదా చరిత్రంటే,ఇంత నిరంతరాయంగా జరిగే
కవిత్వం

అంతిమయాత్రలు

ఉద్వేగపు అడుగులుఉప్పొంగిన కన్నీళ్లుఊరంతా విషాదందారిపొడవునాప్రతి పల్లెఅమరుడు హనుమంతన్నకిపూలతో, తమ కన్నీళ్లతో విప్లవ నినాదాలతోజేజేలు పలికాయిపుల్లెంల నిండా మోదుగుపూలువిరబూసినట్లుగాఎర్రజెండాల రెపరెపలుఆ ఎర్రజెండాలతోఎర్రబారిన ఆకాశంఎగిసిన ఉక్కు పిడికిళ్లుఅమర్ రహే అమర్ రహేహనుమంతన్న అమర్ రహేదిక్కులు పిక్కటిల్లేలాకళాకారుల ఆటలు పాటలుపోలీసుల పికెటింగ్పల్లె నిండా రాజ్యం ఆంక్షలుఅయినాఉసిల్ల పుట్ట పగిలినట్లుగా15 వేల మంది తరలొచ్చారుఇంతకుహనుమంతన్నఎవరికి ప్రత్యక్షంగా తెలుసు..?ఎవరికీ తెలవదు.కానీ అందరి మనసులనుకలియతిరిగాడుఅందరి ఆలోచనల్లోభాగమయ్యాడుఅందుకే అందరి నోళ్ళలోహనుమంతన్న నిండిపోయాడువాళ్ళ మాటల్లో, వాళ్ళ పాటల్లో. పల్లెలో ప్రతీ ఇల్లుదుఃఖపోయడంప్రతీ వ్యక్తి కన్నీరు కార్చడంఆ కన్నీళ్లలో కామ్రేడ్ల త్యాగాలకు నివాళులర్పించడంమొన్న హిడ్మా,నిన్న హనుమంతన్న అమరులందరిఅంతిమయాత్రలుతెలియజేస్తున్నవి ఒక్కటే.."ప్రజావీరులు మృత్యుంజయులు,విప్లవం వర్ధిల్లునని"
కవిత్వం

మరణాన్ని గెలిచే యుద్ధం

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునివచ్చిన దారిలోనికలుపు మొక్కలను ఏరుకుంటూభుజం భుజం కలుపుతూమునుముందుకు సాగుదాంయుద్ధం మధ్యలో తుపాకీనిశత్రువు చేతిలో పెట్టినవాళ్ళ నవ్వులను తిప్పికొడుతూఅమరుల రెప్పల మాటున దాగినకలల సాకారం కోసం సాయుధమవుదాంవర్గ పోరాటం ఎప్పుడూముగిసిపోదు కదాఒకరు ఆపేస్తే ఆగేది కాదిదిపిరికి గుండెలకు చోటు లేనిదిమెలకువను మింగే మాయ తెరలనుఛేదిస్తూ ఉదయాస్తమయాల మధ్యనిత్యమూ సాగె బడలిక ఎరుగనిసుదూర ప్రయాణం కదాఅణగారిన ప్రజల హృదయాలేస్థావరాలుగా యుద్ధం చేసే వాళ్ళకిచివరి మజిలీ ఎన్నడూ లేదు కదాఇది మరణాన్ని గెలిచే యుద్ధం!మాతృత్వాన్ని ప్రేమించే యుద్ధం!మనుషులను కలిపే యుద్ధం!!
కవిత్వం

జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకుంటా

సాగిపోతున్న కాలంలో రాలిపోతున్న పువ్వులెన్నోబతికినంత కాలం సువాసనలు వెదజల్లాలని ఎంత పరితపించేనోఅందుకే నేలను తాకుతుంటే దుఃఖం ఆగట్లేదుఎర్రని మోదుగుపూలంటేనే ఎందుకిష్టమని ఎవరైనా అడిగితే సమాధానం ఒక్క మాటతో ఆగదు ప్రవాహమై సాగుతూ అమరత్వం దగ్గర ఆగుతుందిచీకటి అలుముకున్న ఈ అడవిలో ఎంతోకొంత కాంతినిచ్చేదిఆ మోదుగుపూలేనాలాంటి బాటసారికి దప్పిక తీర్చేవి కూడా అవేఅందుకే కాసింత ఎక్కువ ప్రేమ నరికివేతలో ఒక్కో పువ్వు నేల రాలగానే చాటుంగానైన ఏరి తెచ్చుకుంటాఆ పరిమళపు జ్ఞాపకాన్నిపదిలంగా దాచుకుంటా.
కవిత్వం

అంతం తప్పదు

శాంతి పావురాలను చిదిమేసే "శాంతిదూత" జగానికి "ప్రేమ" దిక్సూచిననిప్రకటిస్తున్నాడు ఆక్రమణదురాక్రమణలతో శాంతిని నెలకొల్పుతానంటున్నాడు ప్రపంచ దేశాలసంపదను దోచుకునేముఠా నాయకుడు..మారణహోమం జరిపేరక్త పిపాసిఆనందంగా ఉండే అన్నాతమ్ముళ్లకీ చిచ్చుపెట్టే జిత్తులమారి నక్కపెట్టుబడిదారీ రక్కసిజగత్తుపై జరిపేహింసోన్మాదానికి నల్ల రాజు తర్వాతిబంటు ఈ తెల్లవాడు..తెలుపు, శాంతికి చిహ్నంఈయన మనసు, అశాంతి క్రోధానికి నిలయం..విశ్వవ్యాప్తంగా పెల్లుబికేప్రజా వెల్లువలోఆకలి మంటల్లోనిరుద్యోగపు జ్వాలల్లో..శ్వేతసౌధం నిశ్శేషం కాక మానదు.యుద్ధోన్మాది అంతం తప్పదు..
కవిత్వం

వసంతం

వసంతం వచ్చినప్పుడుపువ్వులు ఒక్కసారిగా వికసించవుఅవి అప్పుడే నేలపై వెలిసినట్లుమన కళ్ళకు మాత్రమే అలా కనిపిస్తాయి పూసే ముందుభూమి గర్భంలోనే ఉంటాయిచీకటిలో మాటలులేని తపనతోతమ రంగును శ్వాసలా దాచుకుంటాయిఎవరికీ చేరని లోతుల్లోవాన చప్పుడు వింటాయివేళ్ల నరాల ద్వారాకాలం చేసిన గాయాలను తట్టుకుంటూ నిలబడుతాయి వసంతం అంటేపువ్వుల ఉత్సవం కాదుచీకటిని ఓర్చుకున్నభూమి గుండె తిరుగుబాటు చేసిన క్షణంఅందుకేప్రతి పువ్వు ఒక గాయమేఆ గాయమేఈ ప్రపంచాన్ని పరిమళభరితం చేస్తుంది.
కవిత్వం

కవిత్వం ఒక మార్గం

కవిత్వంకవిత్వం భయాన్ని ఎదిరించే ధైర్యం కవిత్వం నిజానికి, అబద్ధానికి తేడా తెలిపే అద్దం.కవిత్వం కోపం అగ్నిలా మారే క్షణం కవిత్వమే అంతరిక్ష కాంతి. కవిత్వమే చీకటి వెనుక దాగిన వెన్నెల.కవిత్వమే అనురాగ నేస్తం.మోదుగుపూలు విరజిమ్మేఎర్రని కాంతి కిరణం కవిత్వం సమాజమార్పు నా కవిత్వం.కంటికి కనిపించే మరోప్రపంచం కవిత్వంకవిత్వం ఒక మార్గం.కన్నీటి చుక్కల ప్రవాహం.
కవిత్వం

అమరుడా నిన్ను నేను పోల్చుకున్నాను

నాకు తెలిసిన పేరు ఉయికె గణేశ్పాక హనుమంతు అని ఇటీవలే వింటున్నాను.నిన్ను చూసిన జ్ఞాపకమూ లేదు మొదట నీ ఎన్కౌంటర్ అయినమృతదేహాన్ని చూసాకేనీ నిజాకృతిని చూసానేమో అప్పుడు ఒక్కసారిగాకుటుంబం ఏర్పడినప్పటి నుంచీస్త్రీ పురుష సంబంధాలుబానిస యజమాని సంబంధాలనినువ్వు పాఠం చెప్తున్నట్లుఊహించుకుంటున్నానుఒక విప్లవకారుని మొహంలో అంత స్త్రీకారుణ్యమేమిటా అనిపించిందికుహనా విప్లవ వాచాలుని నయవంచనను గర్భంలో మోస్తున్నఅపరిచితఎన్నాళ్ళ నుంచి నీ పలకరింపు కోసందుఃఖాన్ని మోసిఇవ్వాళ నీ చితిలో కురిపించిందో గదాఅమరులు, పోరాటకారులు, ఆదివాసులుదండకారణ్యంలో నిర్మించుకున్నజనతన సర్కారుమహిళా జర్నలిస్టు అక్షరాలలో మైదానాల్లో ప్రవహించేంతగుండె నెత్తురులతో వివరించిననీ కథనంఇవ్వాళ ఒక అమరస్మరణగా నిలిచిపోతుందినువ్వు జగదీశ్గా మల్కన్గిరిలో ఆదివాసుల మధ్యనవిప్లవ నిర్మాణం చేస్తున్నప్పుడుసెంట్రీ చేసిన కన్నపేగు
కవిత్వం

నిన్ను ఇంకా  “మమ్మా” అనాల్నా

ప్రజలు చనిపోతుంటే ఇక విజేతలెవరు ఏ అబద్ధమూ బుల్లెట్ గాయాల్ని దాచలేదు బుల్లెట్లతో జల్లెడైన శరీరాలే సత్యానికి నిష్ఠుర సాక్షాలుమా జీవితాలు కుప్పకూలిపోతుంటేఎవరూ విజేతలు కాలేరుప్రజలకు ఊపిరాడనిచోటమమ్మానీకు సింహాసనం వారసత్వం గావొచ్చుగానిమాకది గుండెలో ముల్లు.నీ బిడ్డలుశవాలకుప్పలవుతుంటే నిన్ను ఇంకా మమ్మా అని పిలువ మంటావానువ్వు గెలవలేదు నీకు నువ్వే ఎన్నికైనావు నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావు దారి పొడుగునా నీ ఫ్లెక్సీ లకునిన్నెవరు బాధ్యుల్ని చేస్తారో తెలియదు నువ్వు గెలవలేదు ప్రజల్ని కోల్పోయావు ఆఫ్రికాని కోల్పోయావు మొత్తం ప్రపంచాన్నే కోల్పోయావు నువ్వు ఏమిటో మాకు స్పష్టం స్వార్థం, అహం ప్రజల్ని పాదాక్రాంతులు చేసుకొనే నీ నియంతృత్వం మాకు స్పష్టం .డైమండ్