కత్తుల వంతెనపై సమాజం
నిజమే వర్తమాన సమాజం నిలుచున్నదిక్కడే. అసమానతలు అన్యాయాలు రాజకీయ రాబందుల రాక్షస క్రీడలు నెత్తుటి మరకలు సమాజ దేహానికి కొత్తేం కాదు. ఈ కవిత్వాన్ని ఇష్టంగా ప్రేమగానో రాయలేదు. కవిత వాక్యాలను కన్నీటి సరస్సులో ముంచి మరీ రాశారు. ఈ ప్రపంచం పట్ల బాధ్యతగా రాశారు. కవిత్వ మనోఫలకంపై ఏర్పడే కవితా వాక్యాల ప్రతిబింబాలు పాఠకున్ని ఆలోచింపజేస్తాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన కవి చం ఆధునిక తెలుగు కవిత్వంలో అరుదైన కవి. అంతే ప్రాపంచిక దృక్పథంతో సమాజాన్ని వీక్షిస్తున్న కవి. వర్తమాన సమాజంలో సంక్లిష్టంగాను తీవ్రమైన వైరుధ్యాలతో మన ముందు పరచుకొని వుంది. ఈ సంక్లిష్టతను అధిగమించేందుకు










