కనిపించని డైరీలో కవిత్వపు అంతరంగం
"ఇక మాటలు అనవసరం. కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం విప్లవాత్మక దృక్ఫథంతో రచనలు చేయాలి"-మహాకవి శ్రీశ్రీ(ఖమ్మంలో 8`10`1970న విరసం తొలిమహాసభల సందర్భంగా నిర్వహించిన ప్రతినిధుల సభలో..) నేటితరం కవులు అనివార్యంగా వర్తమాన సమాజంలో జరుగుతున్న అన్యాయాలూ, ఆక్రంధనలు, అత్యాచారాలులాంటి ఘటనలే కాక ప్రతీ సామాజిక దురాగతాలు, అసమానతలూ, దోపిడీ, ప్రపంచీకరణ, కార్పోరేటీకరణ లాంటి ప్రతి దుర్మార్గాన్ని ఎండగడుతూ కలమెత్తుతున్నారు. సామాజిక మాధ్యమాలొచ్చాక కవిత్వపు కాన్వాసు మరింత విశాలంగా మారింది. ఎలా రాస్తున్నారనో ఏం రాస్తున్నారనో విషయాన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా సమాజం గూర్చైతే ఆలోచిస్తున్నారు. ఇటీవం కవిత్వంలోకి మహిళలు వరదలా వస్తున్నారు..ఇది గొప్ప పరిణామం..అలా అనుకుంటున్న క్రమంలో ‘‘ నాడైరీ