సొంత భూమిపై హక్కులు కోరుతున్న జేను కురుబలు
పులులకు దారి కల్పించడానికి నాగరహొళె నుండి బలవంతంగా వెళ్లగొట్టిన దశాబ్దాల తర్వాత జేను కురుబలు తమ పూర్వీకుల స్థలాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు. దక్షిణ భారతదేశంలోని అడవులలో వారాంతంలో వచ్చే పర్యాటకులకు “మీరు మా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు” అనే తమ సందేశాన్ని అందించడానికి డజన్ల కొద్దీ జేనుకురుబ ప్రజలు నాగరహొళె టైగర్ రిజర్వ్ ప్రవేశద్వారం దగ్గర వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని నిలబడి ఉన్నారు: నాగరహొళె పులులను చూస్తారని పర్యాటకులకు హామీ ఇచ్చే సఫారీ పర్యటనలను ఆపడం వారి లక్ష్యం; అటవీ సంరక్షణ పేరుతో తమను తరిమికొట్టిన పూర్వీకుల స్థలాన్ని వ్యాపారానికి ఉపయోగించారని జేనుకురుబలు అంటున్నారు. కర్ణాటక అటవీశాఖ, కర్ణాటక