అస్తిత్వం నుండి విముక్తి దాకా
జైలు కథల అనూరాధగా తెలుగు పాఠకులకు పరిచయమైన బి. అనూరాధ సాహిత్య ప్రస్థానం ఈ సంకలనంలో చూడవచ్చు. హజారీబాగ్ జైలు కథలు తెలుగు కథా సాహిత్యానికి అరుదైన చేర్పు. విప్లవ కథా స్రవంతికి కూడా ఇది సరికొత్త విస్తరణ. మన సాహిత్యంలో ఖైదు కవిత్వం వచ్చినంతగా కథలు రాలేదు. ఎక్కువ మందికి తెలియని ఆ ప్రపంచపు లోతులను ఈ కథలు చూపించాయి. సమాజంలోని సమస్త ఆధిపత్యాలు, వాటిని వ్యవస్థాబద్ధం చేసే రాజ్యం ఆ ఇరుకైన, ఎత్తైన గోడల మధ్య చిక్కగా అల్లుకొని ఉంటాయి. అందులోనే మనుషులుంటారు, మానవీయ స్పందనలు, భావోద్వేగాలు ఉంటాయని పితస్వామ్య వ్యవస్థా పీడితులైన స్త్రీల కోణం










