కొత్త పుస్తకం సమీక్షలు

చదవాల్సిన కవిత్వం

నీలం సర్వేశ్వర రావు  సంపాదకత్వంలో వెలువడిన "మల్లయోధ" కవితా సంకలనంలో మల్ల యోధురాళ్ళ పై లైంగిక వేధింపుపై  రాజ్యం మను ధర్మ  పాలన పై కవులు కవయిత్రులు వివిధ కోణాల్లో తమ కలాలను నిశితంగా నిర్భయంగా ఝుళిపించిన తీరును పరిశీలిస్తే ఆయా భావాల్లో పిడికిళ్లు బిగించగలిగే  శక్తి గలదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొన్ని కవితలు చప్పగా వున్ననూ తిరుగుబాటు స్పష్టంగా కనిపించింది. రేపటి స్ఫూర్తి పొద్దులు కవితలో "వారు స్త్రీలు  ఒంటికి మట్టిపొరల వస్త్రం కప్పుకున్న పాలపిట్టలు అని కుస్తీ లోని ప్రాథమిక సత్యాన్ని వివరిస్తూ" క్రీస్తు పూర్వం 2023 దేశభక్తి కొత్త నిర్వచనం జాతి గీతం అయింది
పరిచయం కొత్త పుస్తకం సమీక్షలు

మహిళలు నిర్మిస్తున్న కొత్త ప్రపంచపు పోరాట  కథలు

46 ఏళ్లుగా చదువుకొంటున్న విప్లవోద్యమ సాహిత్యం మరీ ముఖ్యంగా కథ నవల ఉత్తర తెలంగాణా జిల్లాల  భూమి పుత్రుల, భూగర్భ ఖనిజాలు తవ్వి తీసే సింగరేణి కార్మికుల, ఆదిలాబాద్ అడవి బిడ్డల అక్కడి నుండి సరిహద్దులు చెరిపివేసి మొత్తంగా ఆదివాసుల  జీవన సంఘర్షణలను, బతుకు పోరాటాలను నావిగా చేసుకొనే సంస్కారాన్ని ఇచ్చాయి.  సకల సామాజిక ఆర్ధిక రాజకీయ మానవ సంబంధాల సారం భూసంబంధాల తో ముడిపడి ఉన్నదని, దానిని ఉత్పత్తి శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే మహత్తర యుద్ధం జరుగుతున్నదని అర్ధం అయింది. ఆ యుద్ధంలో భాగమైన మహిళల అనుభవ కథనాలు కథలుగా ఇన్నాళ్లుగా  చదువుతున్నవే. .వాటిని ఇప్పుడు
పరిచయం కొత్త పుస్తకం సమీక్షలు

విప్లవోద్యమ కథాసమయం

(*వియ్యుక్క*  పేరుతొ  అజ్ఞాత రచయిత్రుల కథలు ఆరు భాగాలుగా విరసం తీసుకొస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఇందులో మూడు  పుస్తకాలు విడుదల అయ్యాయి. వీటి ఆవిష్కరణ ఈ నెల 24 న హైదరాబాదులో ఉంది. ఈ సందర్భంగా తొలి మూడు భాగాలకు వియ్యుక్క ఎడిటర్ బి. అనురాధ రాసిన ముందుమాట పాఠకుల కోసం ...వసంత మేఘం టీం ) పెన్నూ గన్నూ పట్టిన రచయిత అనగానే మనకి మొట్టమొదట గుర్తుకొచ్చేది సుబ్బారావు పాణిగ్రాహి. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అందులోనూ ఒక చేత్తో గన్ను పట్టి పోరాటం చేస్తూ
కొత్త పుస్తకం

బాల్యపు జాడలెక్కడ ?

(ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు కాటెపోగు రత్నంయేసేపు (కెఆర్‌వై) కవితా సంపుటి *బాల్యమే శరణార్థి*కి అధ్యాపకజ్వాల/ఉపాధ్యాయక్రాంతి మాజీ ప్రధాన సంపాదకుడుపి. మోహన్‌ రాసిన ముందుమాట. 16వ తేదీ కర్నూలులో ఆవిష్కరణ) కాటెపోగు రత్నంయేసేపు (కెఆర్‌వై) తెస్తున్న మొదటి కవితా సంకలనం యిది. కవితలన్నీ చార్వాక కలం పేరుతో రాసినవే. మొత్తం 25 కవితలు. 12 కవితలు విద్యారంగానికి సంబంధించినవి కాగా, మిగిలినవి వివిధ సందర్భాల్లో జరిగిన సంఘటనలకు స్పందించి అక్షరీకరించిన కవితలు. తనకున్న తాత్విక భావజాల కోణంలోంచి వీక్షించి కవితలుగా మలిచారు. అన్నీ వస్తు ప్రధానమైన కవితా ఖండికలే. భావ ప్రాధాన్యాన్ని బట్టి కవితల్లో శైలి, శిల్పం వాటంతకవే అమరిపోయాయి.