పరుగుల జీవితం
కాలం తన పరుగును ఆపదు. రోజులు మారుతాయి, రహదారులు మారుతాయి, పనులు మారుతాయి…కాని మనిషి హృదయంలో మాత్రం నిశ్శబ్దం నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. దాదాపు పాతికేండ్ల క్రితం మమతా కాలియా గారు రాసిన “పరుగు” నవల. నేటి వేగవంతమైన జీవితాన్ని చూస్తే నిజమేనని మనకు అనిపిస్తుంది. తరాలు ఎంత మారినా, మనిషి అంతరంగంలో కలిగే ఒంటరితనం మాత్రం మారలేదు. బయట శబ్దం పెరిగింది, లోపల సున్నితమైన నిశ్శబ్దం మరింత గాఢమైంది. మనుషులు లక్ష్యాల వెంట పరుగెత్తడంలో బిజీగా ఉన్నారు కాని ఆ పరుగులో తన వాళ్లను, తన బంధాలను, తన వెచ్చదనాన్ని…చాలా సార్లు తమను తామే నెమ్మదిగా వెనుక










