విప్లవోద్యమంలాగే మేరువు సావిత్రమ్మ జీవితం
అనాదిగా భారతీయ సమాజం అనేక రకాల ఆధిపత్యాలను, అసమానతలను తనలో నింపుకుని కాలంతో పాటు ప్రయాణం చేస్తుంది. ఇట్లాంటి అసమానతలకు, ఆధిపత్యాలకు వ్యతిరేఖంగా పీడిత సమూహాల పోరాట పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సాగుతున్న ఈ పోరాటాలలో ఎంతో మంది మనుషులు కుల, వర్గ, జాతి, లింగ భేదం లేకుండా తమ జీవితాలను త్యాగమయ జీవితాలుగా మార్చుకున్నారు. ఏ అసమానతలు లేని సమాజం కోసం తమ ప్రాణాలను సైతం యుద్ధంలో ఉంచారు. అట్లాంటి మార్పుకోసం జరిగే యుద్ధంలో పాల్గొన్న మనుషులు కూడా అనేక సార్లు సమాజం విధించిన అణచివేతల భావజాలం నుండి తప్పించులేకపోయారు.










