పౌరహక్కుల నాయకత్వంపై రాజ్యం దాడి
“దేవున్ని నమ్మే గుంపులో ఏ నిర్ణయం ప్రవేశ పెట్టాలన్న దేవుని పై పదే పదే విశ్వాసం ప్రకటించాల్సి వుంటుంది - బాలగోపాల్” సరిగ్గా బాలగోపాల్ చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కూడా చివరకు హిందూ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా తయారు చేసిన “ఫ్లెక్సీ పొరపాటున ప్రింట్ అయింది” అని మీడియా ముందు స్పష్టం చేసి, పౌరహక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్) కమిటి 20 వ మహాసభను ప్రారంభించాల్సి వచ్చింది. తిరుపతిలో పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పడిన బ్యానర్ వివాదం పెద్ద రాజకీయ–సామాజిక, సాంస్కృతిక చర్చకు దారితీసింది. ఈ ఘటనలో పౌర హక్కుల సంఘం










