హిడ్మా హత్య చట్టాతీతం
2025 నవంబరు 18నాడు స్థానిక ఆదివాసీ కార్యకర్త, నక్సలైట్ నాయకుడు మడావి హిడ్మా, అతని కామ్రేడ్, జీవన సహచరి మడకాం రాజేని మరో 11 మందిని చంపినట్లు భారత రాజ్యం విజయవంతంగా ప్రకటించింది. ఈ సైనిక 'విజయం'తో, భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేయడానికి హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన 2026 మార్చి 31 గడువును విజయవంతంగా చేరుకుంటున్నట్లు బిజెపి ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర అట్టడుగు వర్గాలను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న పెట్టుబడిదారులు భూమిని, సహజ వనరులను స్వాధీనం చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి బిజెపి ప్రభుత్వ అణచివేత విధానాలలో










