వెనుజులాపై దాడి – సామ్రాజ్యవాద సాధారణ ఆర్ధిక సంక్షోభానికి పరాకాష్ట
జనవరి 3 వ తేదీ అర్ధరాత్రి వెనుజులా రాజధాని కారకాస్ లోని అధ్యక్ష భవనంపై 200 మంది అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రత్యేక బలగాలు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన జీవిత సహాచరిని ఎత్తుకెళ్లి అక్రమంగా అమెరికాలో నిర్భంధించారు.ఈ కిడ్నాప్ కు ముందు ఏ అంతర్జాతీయ సంస్థలలో ఏలాంటి చర్చా లేదు.అమెరికా చట్ట సభ కాంగ్రెస్ అనుమతి కూడా లేకుండా అధ్యక్షుడు ట్రంప్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.1989 లో పనామా దురాక్రమణ తరువాత లాటిన్ అమెరికా ప్రాంతంలో అమెరికా మిలటరీ చేసిన ఈ దురాక్రమణ పూరిత సామ్రాజ్యవాద దాడిని ఇతర ఖండాల,భూభాగాలలోని జాతుల రాజ్యాలైన

