ఇంటర్వ్యూ

హస్ దేవ్‍ను కాపాడుకుంటాం

10 ఏళ్లకు పైగా గడిచిపోయింది, హస్‌దేవ్‌లో జరుగుతున్న చెట్ల నరికివేతను, బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఎలాంటి తార్కికమైన ప్రభావం లేదా ఫలితం రాలేదు. వాస్తవానికి, కార్పొరేట్ - ప్రభుత్వాల మధ్య బంధం చాలా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. మనం నీరు, భూమి, అడవులను కాపాడటానికి ప్రయత్నించాలి. మనం ఈ విధ్వంసాన్ని ఆపకపోతే, మానవ నాగరికతకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ పోరాటం కేవలం హస్‌దేవ్ ఆదివాసులది మాత్రమే కాదు. ఇది మొత్తం సర్‌గుజా డివిజన్ ప్రజల పోరాటం. మనం గెలిపించిన ఎంపీలు
ఇంటర్వ్యూ

హింసా నివారణకు శాంతి చర్చలే మార్గం

1. పాలకులు కాల్పుల విరమణ ప్రకటన చేయాలని ఇటీవల పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తరపున పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు కదా? ఈ ప్రయత్నంలో మీ వేదిక అనుభవం ఏమిటి? కాల్పుల విరమణ ప్రకటన చేయాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ సంతకాల సేకరణ కోసం మేం కలసిన వారిలో చాలా మంది తెలంగాణలో కాల్పులు జరగడం లేదు కదా ...మీరు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు పైగా తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులపట్ల సానుభూతిగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కనిపించడం మాత్రమే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలైట్ సమస్య శాంతి భద్రతల
ఇంటర్వ్యూ

నన్నిలా ఉండనీయండి

(మొదట్లో అరుంధతి రాయ్ కు తన జ్ఞాపకాలను రాయాలనే ఆలోచన రాలేదు . తనను బాగా ప్రభావితం చేసిన , చికాకు పెట్టిన తన తల్లి మేరీ రాయ్ చనిపోయిన తర్వాతనే (Mother Mary Comes To Me ) రాయాలని భావించింది . ఈ పుస్తకం మేరీ రాయ్ జీవితానికి ఒక కిటికీ వంటిది. మేరీ రాయ్ అంతగా విస్మరించాల్సిన మనిషి కాదు . శూన్యం నుండి బయలుదేరి క్రిస్టియన్ వారసత్వాల కింద పనిచేస్తూ, స్త్రీల  సమానహక్కుల కోసం కొట్లాడిన మనిషామె. కొట్టాయంలో ఆమె జీవితాన్ని ఒక సూపర్ హీరో లాగా నడిపించి, తన 89 సంవత్సరాల 
ఇంటర్వ్యూ

ప్రజా ప్రయోజనం కోసం శాంతి కోరుకుంటున్నాం

(శాంతి చర్చల కోసం లేఖ రాసిన మావోయిస్టు నాయకుడు రూపేశ్‌ బస్తర్ టాకీస్ యు ట్యూబ్ ఛానెల్ వికాస్ తివారీతో చేసిన సంభాషణ ఇది . దేశమంతా  శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్న తరుణంలో శాంతి గురించి , ప్రజా ప్రయోజనాల గురించి , విప్లవం గురించి తెలుసుకోడానికి మావోయిస్టు ఉత్తర - పశ్చిమ కమిటీ నాయకుడి అభిప్రాయాలు ఉపయోగపడతాయని పాఠకులకు అందిస్తున్నాం - వసంత మేఘం టీం ) వికాస్ తివారీ: ఛత్తీస్‌ఘడ్‌లో నాలుగు దశాబ్దాల నుంచి మావోయిజం ఉన్నది. నాలుగు దశాబ్దాల నుంచి  మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యలో
దండకారణ్య సమయం ఇంటర్వ్యూ

“ఆపరేషన్ కగార్” సైనిక గడువు అదివాసులను అంతం చేయడానికే : సోనీ సోరి

(బస్తర్ లో ఈ రోజుల్లో ఒక మారణహోమం జరుగుతోంది. అక్కడ నక్సలైట్ల పేరుతో అర్ధ సైనిక బలగాలు పెద్ద ఎత్తున ఆదివాసీలను హత్య చేస్తున్నాయి. ఆదివాసీల భూమిని కార్పొరేట్ సంస్థలకు ఎలా స్వాధీనం చేయాలి అనేది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి అంటున్నారు. మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి మీనా కందసామి సోనీ సోరీతో మాట్లాడారు. ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూ ను ఇక్కడ అందిస్తున్నాము - ఎడిటర్) మీనా కందసామి: కార్యకర్తల అరెస్టుల పెరుగుదల గురించి నా మొదటి ప్రశ్న. మూల్‌వాసీ బచావో మంచర్ (ఎంబిఎం)
ఇంటర్వ్యూ

ప్రమాదకరమైనా సరే అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందే

(దశాబ్ద కాలం తరువాత ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు నిర్దోషిగా విడుదలైన్ హేమ్ మిశ్రా తన జైలు శిక్ష, విచారణ, అనుభవాల గురించి ‘అవుట్ లుక్’కు చెందిన విక్రమ్ రాజ్ తో మాట్లాడారు) హేమ్ మిశ్రా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు 2013 లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మొదటిసారి అరెస్టు చేసారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు కొరియర్గా పనిచేశాడని, దేశంపై యుద్ధం చేస్తున్నాడని అభియోగాలు మోపారు. 2017మార్చి 7నాడు గడ్చిరోలి సెషన్స్ కోర్టు హేమ్, మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2024మార్చి 5నాడు బాంబే హైకోర్టు-నాగ్పూర్ బెంచ్ ఈ కేసులో హేమ్, మరో
ఇంటర్వ్యూ

పదముగ్గురు నక్సలైట్ల ఎన్‌కౌంటర్ బూటకమేనా?

(నిజ నిర్థారణకు వెళ్ళి వచ్చాక బస్తర్ జంక్షన్ అనే యూ ట్యూబ్ ఛానెల్ తో సంభాషణ. హిందీ  వీడియోకి తెలుగు అనువాదం) బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఘటనా స్థలం నుంచి ఎల్‌ఎమ్‌జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయి నివేదిక కూడా చేశాం.. మీరు మా గత నివేదికలు చూడవచ్చు. ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సందేహాలు తలెత్తుతున్నాయి, పోలీసుల వ్యవహార శైలి, వారి వాదనలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి, పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి, ఈ ప్రశ్నలు
ఇంటర్వ్యూ

యూఏపీఏను రద్దు చేయాలి  – ఇందిరా జైసింగ్

( ప్రొ.జి.ఎన్.సాయిబాబా, అతని తోటి నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై ట్వీట్ చేసిన వారిలో మొదటివారు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల నుండి, విప్లవ కవి వరవరరావు (భీమా కోరేగావ్ కేసులో నిందితులు, 2021లో బెయిల్ వచ్చింది) మొదటి మహిళా అదనపు సొలిసిటర్ వరకు, ప్రాథమిక హక్కులను కోల్పోయిన వారి కోసం అనేక న్యాయ పోరాటాలు విజయవంతంగా చేయడంలో ఆమె గుర్తింపు పొందింది.   1986 మేరీ రాయ్ కేసు, 1999 గీతా హరిహరన్ కేసు వంటి మహిళల వివక్షకు వ్యతిరేకంగానూ, జనరల్ కేసులను కూడా చేసారు. ఆనంద్ గ్రోవర్‌తో పాటు, ఆమె ఆన్‌లైన్
ఇంటర్వ్యూ

పిటిషన్ల కన్నా సమిష్టి పోరాటం ముఖ్యం

 (స్వలింగ వివాహాలను స్పెషల్ మ్యారేజి యాక్ట్ ప్రకారం గుర్తించాలని  కోరుతూ  ట్రాన్స్ జెండర్  సమూహం  పిటిషన్ ల పై సుప్రీం కోర్ట్ ఇటీవల స్పందిస్తూ .. దీని మీద పార్లమెంట్  చట్టం చేయాలని ప్రభుత్వానికి చెప్పింది. దీనిపై   కృషాణు (krishanu)  అనే క్వియర్  స్పందన ఇది)    1. ఈ తీర్పు పై మీ ప్రతి స్పందన ఏమిటి ? చాలా నిరాశ కు గురయ్యాను  కానీ , ఇలా  జరగదని  నేను అనుకోలేదు. 2. ఇప్పటి వరకు  ఈ సమస్య తెలియని  పాఠకుల కోసం  ఈ పిటిషన్ నేపథ్యాన్ని కాస్త  వివరిస్తారా .. 2020 లో  క్వీర్ జంటలు
ఇంటర్వ్యూ

రచయిత తన రచన పట్లనిర్మమకారంగా ఉండాలి

మహమూద్‌ నాకెంతో ఇష్టమైన కవుల్లో ఒకడు. ఆ మాటకొస్తే సొంత ఊరు వాడు కాబట్టి ఇంకాస్త ఎక్కువే ఇష్టం. మహమూద్‌ని నేను మొదటి సారి 1999 -2000 ప్రాంతంలో  ప్రొద్దుటూరుకు వెతుక్కుంటూ వెళ్లి కలిశాను. అప్పటి నుంచి నాకు అతనితో సాన్నిహిత్యం ఉంది. నాకు మహమూద్‌ అంటే మిత్రజ్యోతి సంస్థ వ్యవస్థాపక సభ్యుడు.  “సీమ కవిత’’ సంకలనం ఎడిటర్‌. “మిష్కిన్‌’’ కథా రచయిత. ఇప్పుడు “ఆస్మాని’’ కవి.కవిగా, కథకుడిగా, కార్యనిర్వాహకుడిగా సీమ సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేసినవాడు. అక్కడి ఒక తరానికి స్ఫూర్తినిచ్చినవాడు. క్షణం క్షణం పొట్ట తిప్పల కోసం పాకులాడుతూనే మరోవైపు తాను పుట్టిన గడ్డ కోసం, సమాజం కోసం పరితపించినవాడు. కీర్తి కోసం కాకుండా