సాహిత్యం

गुमुड़ावेल्लीरेणुका – कड़वेंडीकीलाडलीबेटी, जनताकीअमरयोद्धा

कॉमरेड गुमुड़ावेल्ली रेणुका का जीवन एक खुली किताब की तरहहै. तीन दशकों की उनकी क्रांतिकारी यात्रा और क्रांतिकारी आंदोलन में योगदान को उनके जीवन से भी बड़ा कहा जा सकता है. उनका तीस साल का क्रांतिकारी संघर्ष उत्पीड़ित महिलाओं के लिए मुक्ति का संदेश है. कॉमरेड रेणुका एक अटल और समर्पित कम्युनिस्ट क्रांतिकारी थीं. वह एक दृढ़निश्चयी योद्धा थीं, जिन्होंने गुरिल्ला जीवन की कठिनाइयों, कष्टों और पीड़ाओं से कभी भी
సాహిత్యం

నేటితరానికి గర్వకారణం భూమిక

(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ సీనియన్ కార్యకర్త  కామ్రేడ్ విజయ లక్ష్మి @భూమిక కథల సంపుటి *ప్రజలు అజేయులు *కు  రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది మే 21 న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నారాయాణపూర్  గుండెకోట్  అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది) భారత విప్లవ ప్రజానీకానికి తీవ్రమైన గుండెకోత మిగిల్చిన గుండె కోట్‌ అమరులలో ఒకరు తెలంగాణ పోరు బిడ్డ వన్నాడ విజయలక్ష్మి. విప్లవోద్యమంలోని మిత్రులకు భూమిక. రచయితగా పాఠకులకు వసుధ. ఉస్మానియా యూనివర్సిటీలో తన చదువుకున్న వారికి బహుశా విజ్జి అయి ఉంటుంది. గత కొంతకాలంగా ‘ఇక విద్యార్థులు
కథలు

వెన్నెల వసంతం

ఈ కథ ఇప్పుడు మరోమారు చదివా.  అప్పుడెప్పుడో రాంగూడా హత్యాకాండ సమయంలో రాసినా ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న హత్యాకాండల నెత్తుటి తడి మనకు తగులుతుంది. ఒకసారి కథలివి వెళితే ..  . ఇప్పుడు అమ్మలేదు. ఆమె జ్ఞాపకాలు తప్ప. అమ్మ అరుణ. అమ్మ డైరీలో భద్రపర్చుకున్న జ్ఞాపకాలను తనలోకి ఒంపుకుంటుంది వెన్నెల. అమ్మా - వసంత్ అమ్మ అరుణ.మరి వసంత్ ఎవరు? అమ్మ జీవితంలోకి వసంతే వచ్చాడో! వసంత్ జీవితంలోకి అమ్మే వెళ్ళిందో కానీ, ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోలేకపోయారు. అమ్మ 'కుటుంబం'గదిలో ఇరుక్కుపోయింది. వసంత్, అడవిలో వసంతమై విరబూసిండు. ఆదివాసిని అంతం చేసి ...అడవిని ఆక్రమించి
సాహిత్యం

బ్రతికించే మాటల్నివాగ్దానం చేసే కవి బాలాజీ

(ఇటీవల విడుదలైన పలమనేరు బాలాజీ కవితా సంపుటి *లోపలేదో కదులుతున్నట్లు*కు రాసిన  ముందుమాట ) ఒక ఊరి పేరు చెప్పగానే ఓ రచయిత గుర్తుకు రావడం అసాధారణ విషయం .ఊరు పేరుకి తన కవిత్వానికి,అస్తిత్వాన్ని నిలిపి నిలుపుతూ కొనసాగుతున్న రచయిత పలమనేరు బాలాజీ. ఊరి పేరును ఇంటిపేరుగా స్థిరపరచుకున్నారు. ఈ రచయిత కవిత్వం ,కథ ,నవల, విమర్శ ఇలా నాలుగు స్తంభాలాట ఆడుతూ విజయవంతంగా ముందుకెళ్తున్నారు. గతంలో మాటల్లేని వేళ ,ఇద్దరి మధ్య అంటూ  పాఠకుల్ని పలకరించారు. బాలాజీ కవిత్వానికి మనిషితనం కేంద్ర బిందువు. ఎలా ఉండాల్సిన మనుషులు ఇలా ఎందుకు అయ్యారు ?అనేది ఆ కవి చేస్తున్న
కథలు

భయం, అభద్రత

ఇవ్వాల్టి  సగటు ముస్లిం జీవితం ఈ కథలో ఉంది. నేటి పెహెల్గాం సందర్భమే కాదు. నిన్నటి కరోనా సందర్భమూ కూడా ముఖ్యంగా మోషాల నాయకత్వంలో బీజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భయం! అభద్రత! మరీ ఎక్కువయ్యింది. చదువుకున్నవారు చదువురానివారు అనే తేడా లేదు. వయసు బేధం అంతకూ లేదు. మతం మత్తు ఎక్కితే చాలు. అందులో భాగమే చదువుకున్న రఘు"రోజూ చాలా మంది ముస్లింలు మన దేశానికి వస్తున్నారట. అట్లా వచ్చి ఇక్కడే ఉండిపోయి బాంబులు పెట్టి జనాలను చంపేస్తున్నారట" అంతా "అట" ప్రచారమే. వాస్తవ  పరిశీలన ఉండదు. మంచీ చెడుల ఆలోచన ఉండదు. నిజనిజాలకు తావేలేదు.
కథలు

మెట్ల మీద

"రవీందర్ ఎక్కాల్సిన మెట్లు ఎక్కనూ లేక, ఎక్కిన మెట్లు దిగనూ లేక సందిగ్ధంలో నిలబడిపోయాడు" ఎవరీ రవీందర్? ఎందుకీ సందిగ్ధత? తెలంగాణ విప్లవోద్యమ ఉద్యమ ప్రతిభావిత గ్రామం నుండి అజ్ఞాతంలోకి వెళ్లి పదిహేనేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. సత్తువ లేకనో చైతన్యమే కొరవడిందో తిరిగొచ్చి సాధారణ జీవితం గడపాలనుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన నజరానా కూడా వద్దనుకొని సాదాసీదాగా ఉండాలనుకున్నాడు. ఐనా ఏదో సందిగ్ధత. యాదమ్మకు తన ముఖం చూపించలేకపోతున్నాడు. ఎవరీ యాదమ్మ? ఐలయ్య తల్లి. తన ప్రభావంతో ఎదిగి ఉద్యమంలో చేరి అమరుడయ్యాడు. ఇప్పుడా తల్లికి ఏం సమాధానం చెప్పాలి. ఎట్లా తన ముఖం చూపించాలి . సమాజం పట్ల
సాహిత్యం వ్యాసాలు

మనిషితనంపై విశ్వాసంతో

(ఇటీవల విడుదలైన బాల సుధాకర్ మౌళి కథా సంపుటికి రాసిన ముందుమాట) కవిగా ప్రసిద్ధుడైన బాల సుధాకర్  మౌళి యిప్పుడు కథకుడిగా మన ముందుకు వస్తున్నాడు. కవిత్వం కథ ఈ రెండింటికి పోటీ పెట్టి యెక్కువ తక్కువల్ని  అంచనా వేయడం తప్పే గాని రెండు సృజనాత్మక వ్యాసంగాల్నీ ఒకే  రచయిత నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యక్తికున్న కవిత్వ అభివ్యక్తి కథనం నైపుణ్యం వొకదాన్ని మరొకటి యెలా ప్రభావితం చేసుకుంటాయి అన్న అధ్యయనం ఆసక్తి గొలుపుతుంది, విమర్శలో కొత్త ఆలోచనలకు సంవిధానానికి దారులు వేస్తుంది.  కథలో కవిత్వ చ్ఛాయలు కథకు వన్నె తెస్తాయి. అలాగే కవిత్వంలో వినిపించే అనుభూతి కథను తాకితే
సాహిత్యం

గందరగోళం లోనే రాస్తాను

రాజ్యం కోరలు ఎల్లెడలా విస్తరించే చోట నాకంటూ ఒకచోటు లేకుండా పోయింది నేను నేను తినే ఆపిల్ పండు బిర్యానీలో వేసే కుంకుమపువ్వు అన్ని కాశ్మీరు నుండి దొం గిలించినవే రాసుకోవడానికి ఒక టేబుల్ ఉండదు పుస్తకాలకు ఒక సెల్ఫీ ఉండదు నాకు ఇష్టమైన "జీత్ సాయిల్" కవిత్వం తనివితీరా చదువుకునేందుకు వీలుండదునురగలుగక్కే కాఫీ తాగడం పూలను పలకరించి మాట్లాడడం ఎప్పటికీ తీరని కల కళ్ళు లేని మా నాయన నష్టాలు గూర్చి ఎప్పుడు లొల్లి పెడుతుంటాడు ఊది ఊది మా అమ్మ ఊపిరితిత్తులు ఖాళీ అయిపోయాయిసిలిండర్ లేని బతుకు మాది మరోవైపు జైలు ఊచల నుండి మా
కథలు

అంటరాని బతుకమ్మ

అనగనగా ఒక కథ కొత్త కాలం ఈ సంచిక నుంచి మొదలవుతోంది . నిన్న చదివిన కథ ఇవాళ మరోసారి  చదివితే  కొత్తగా ఉంటుంది. నిన్న గ్రహించలేని అర్థాలు వినిపిస్తాయి . కవి నాగేశ్వర్ తాను మరో  సారి చదువుతున్న కథలను మనకు పరిచయం చేసే శీర్షిక ఇది - వసంత మేఘం టీం కథలో జీవితం కనిపిస్తుంది . ఆ జీవితాన్ని కథ   మన అనుభవంలోకి తెస్తుంది .  ఆ అనుభవం మనల్ని ఆలోచనల్లోకి నెట్టి ఆచరణ వైపు నడిపిస్తుంది . కథ జీవితం లాంటిది. కథ లాంటిది  జీవితం. అదే విప్లవ కథ. అట్లాంటి విప్లవ
సాహిత్యం కవిత్వం

హంజా     

దేశ దేశాల కవిత్వంతో కరచాలనం (*అనువాద స్వరం* కొత్త కాలం ఈ సంచిక నుంచి మొదలవుతోంది . పాలమూరు నుంచి ప్రపంచ కవిత్వాన్ని పరిశీలిస్తూ , అధ్యనం చేస్తున్న  సీనియర్ కవి ఉదయమిత్ర ఈ శీర్షికను నిర్వహిస్తారు) హంజామా ఊళ్లోఒక సాధారణ వ్యక్తిరొట్టె ముక్క కోసంచెమటోడ్చే కూలి ఓ రోజునేను ఆయనను కలిసినప్పుడుఊరంతావిచారంలో మునిగి ఉందిగాలి మొత్తం స్తంభించినట్టుగా ఉందిలోలోపలేఓడిపోయిన ఫీలింగ్ కలిగింది హంజా నవ్వుతూ భుజం తట్టిఇలా అన్నాడు"అక్కాఇది పాలస్తీనా దీని గుండెలయసముద్రహోరుఆగేదిగాదు సమస్త పర్వతాల ,అగ్నిగర్భాల రహస్యాల్ని దాచిపెడుతుందిది ఈ నేలపొడుగునాఎన్ని నిర్బంధాలముళ్ళ తీగలు పరుచుకున్నాఇదినిరంతరం యోధులకు జన్మనిస్తుంది . ఇదిఉనికిని కోల్పోయే జాతులకువిశ్వాసాలనిచ్చే… వీరమాత