పసిపాప పాల కోసం ఏడిస్తే
తల్లి పాడే జోల పాటలో వారున్నారు

బంజరు పట్టిన నేలను
పంటగా మార్చే రైతన్న నాగలిలో ఉన్నారు

కొంగు నడుముకు సుట్టుకుని
బురదలో నాట్లేసే నాటు పాటలో ఉన్నారు

కులం పేర దాడి జరిగితే
ఆత్మగౌరవం కోసం చేసే
పోరాటపు డప్పులు ఉన్నారు

అత్యాచారం చేయబడిన స్త్రీల
తిరుగుబాటు పిడికిళ్లలో వారున్నారు

పింఛన్ కోసం వెళితే
లంచాలకు మరిగిన ఆఫీసర్లను
నిలదీతలో వారున్నారు

డిమార్ట్లో, ట్రెండ్స్లో చాలీ చాలని జీతాలతో బతుకీడుస్తున్న
ప్రతి కార్మికుడి కష్టంలో ఉన్నారు

అందరికీ దిక్సూచిగా ఉన్న
ఎర్రని జెండాలో వారున్నారు.

Leave a Reply