వాళ్ళు పేరుకోసమే వెళితే
వాళ్లకి మారుపేరేందుకు?
వాళ్ళు భూమికోసమే వెళితే
వాళ్ళ అమ్మ గుడిసెలోనే ఎందుకుంది?
వాళ్ళు నిధుల కోసమే వెళితే
వాళ్ళ ఒంటికి ఒక్క వెండి ఉంగరమైన ఎందుకు లేదు ?
వాళ్ళు వాళ్ళకోసమే వెళితే
ఈరోజు నిర్జీవంగా ఎందుకు పడున్నారు ?
ఆకలి మంటల ఆర్తనాదాన్ని అనుభవించి వెళ్ళారు
బాంచెన్ బతుకు ఇక నడవదని
నినందించి వెళ్ళారు
మానవత్వాన్ని మరిచిన
మనకి మనిషితనాన్ని నేర్పించడానికి వెళ్ళారు
దోపిడి, దౌర్జ్యాన్ని ఎదిరించి
శ్రామిక రాజ్యాన్ని నిర్మించటానికి వెళ్ళారు
వాళ్ళు మనకోసమే వెళ్ళారు
మన బతుకుల్లో వెలుగు కోసం వెళ్ళారు
నీకు నాకు మనందరికీ
హక్కులని పంచడానికి వెళ్ళారు
వాళ్ళు మనకోసమే వెళ్ళారు
మన కోసమే అమరులయ్యారు.

Leave a Reply