భారత ప్రభుత్వం నవంబర్ 21, 2025 నుండి 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 కొత్త కార్మిక కోడ్లను (Labour Codes) అమలులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక కోడ్లు (చట్టాలు)(New Labour Codes) ప్రజల్లో కార్మిక లోకంలో పెద్ద చర్చకు దారితీశాయి. కార్మికులు వీటిని “బానిసత్వ చట్టాలు”గా అభివర్ణిస్తుంటే, ప్రభుత్వం ఇవి “వ్యాపార సులభతరం (Ease of Doing Business)” కోసం చేసిన సంస్కరణలని అంటోంది.అయితే ఈ కార్మిక చట్టాలను మనం గమనిస్తే ఇవి కార్మికుల హక్కులను కాలరాస్తూ , యాజమాన్యాలకు పూర్తి అధికారాలను కట్టబెడుతూ కార్మికులను ” కట్టు బానిసలుగా” మార్చడానికి కార్పొరేట్ స్థాయి నుండి మధ్య, చిన్న తరహా కంపెనీ యాజమాన్యాలకు అన్ని వేసులుబాటులు ఇవ్వబడినవని అర్ధమవుతుంది.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 కొత్త కార్మిక కోడ్లు ఏమిటని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. పాత 29 చట్టాలను కలిపి ప్రభుత్వం ఈ క్రింది నాలుగు కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం మార్చింది.
ఈ నాలుగు లేబర్ కోడ్స్ లో ముఖ్యంగా
వేతన కోడ్ (Code on Wages, 2019): కనీస వేతనాలు, బోనస్ చెల్లింపులకు సంబంధించింది.పారిశ్రామిక సంబంధాల కోడ్ (Industrial Relations Code, 2020): ట్రేడ్ యూనియన్లు, లే-ఆఫ్స్, వివాదాల పరిష్కారం. సామాజిక భద్రత కోడ్ (Social Security Code, 2020): PF, ESI, గ్రాట్యుటీ, బీమా వంటి ప్రయోజనాలు. వృత్తిపరమైన భద్రత & ఆరోగ్య కోడ్ (OSH Code, 2020): పని చేసే చోట భద్రత, పని గంటలు, సెలవులు గురించి తెలపడం జరిగింది.
ఈ కొత్త చట్టాలలోని అనేక వివాదాస్పద అంశాలు ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా ఈ అంశాల గురించి మనం చర్చించుకుంటే పనిగంటల పెంపుదల ముఖ్యమైనది. పాత చట్టాలలో కార్మికుల పని గంటలు రోజు కి 8 గంటలు ఉంటే ప్రస్తుత చట్టంలో నియమాల కంపెనీల యాజమాన్యానికి రోజుకు 8 నుండి 12 గంటల వరకు కార్మికుల పని గంటలను పెంచుకోవచ్చు వారానికి 48 గంటలు మించకూడదని ఉన్నాకానీ,12 గంటల పని వల్ల కార్మికుల వ్యక్తిగత జీవితం దెబ్బతింటుందని, ఇది శ్రమ దోపిడీకి దారి తీస్తుంది.
మరో ప్రధానాంశం ‘హైర్ అండ్ ఫైర్’ (ఇష్టమొచ్చినప్పుడు తీసేయడం)గతంలో 100 కంటే ఎక్కువ మంది కార్మికులున్న సంస్థలు ఎవరినైనా తీసేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు కొత్త చట్టంలో ఆ పరిమితిని 300 మందికి పెంచారు. అంటే 300 లోపు ఉద్యోగులున్న కంపెనీలు ఎప్పుడైనా, ఎవరినైనా నోటీసు లేకుండా తొలగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత (Job Security) ఉండదు. కొత్త కార్మిక చట్టంలో కార్మికుల సమ్మె చేసే హక్కుపై ఆంక్షలు ఏదైనా పారిశ్రామిక వివాదం ఉంటే, కనీసం 60 రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా సమ్మె చేయడానికి వీల్లేదు. ఒక వేల నోటీసు ఇవ్వకుండా సమ్మె చేస్తే కార్మికులు పై చర్యలు తీసుకునే అవకాశం.దీనివల్ల కార్మికుల నిరసన గళం నొక్కేవేయడం,కార్మికుల సమ్మె చేసే ప్రజాస్వామిక హక్కును హరించి వేయడమే.
ఇక కొత్త కార్మిక చట్టంలో కంపెనీలలో శాశ్వత ఉద్యోగాల స్థానంలో “ఫిక్స్డ్ టర్మ్” (కొంత కాలం పరిమితి, కాంట్రాక్టు ఉద్యోగాలు) ఉద్యోగాలను ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల యజమానులు పని అయిపోగానే కార్మికులను పంపేయవచ్చు. దీనివల్ల కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కవు. దీనివలన కార్మికులు వృద్ధాప్యంలో దిక్కులేక బతికే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త కార్మిక చట్టాలలో కార్మికుల భవిష్య నిధి ప్రావిడెంట్ ఫండ్(PF) జమచేయకుండా యాజమాన్యాలకు సడలింపు ఈ కొత్త చట్టంలో తక్కువ మంది కార్మికులున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు PF, ESI, గ్రాట్యుటీ నిబంధనల నుండి సడలింపు ఉన్నది. దీనివలన తక్కువ కార్మికులున్న కంపెనీలు కార్మికులకు ప్రావీడెంట్ ఫండ్( PF), ESI వంటివి జమ చేయవు.
దీనివల్ల కూడా కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కవు.
కొత్త లేబర్ కోడ్ ల మహిళా కార్మికులకు భద్రత కరువు.
పాత కార్మిక చట్టాలలో మహిళలు సాయంత్రం 6 వరకు పనిచేయాలనే నిబంధనలు ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో మహిళ కార్మికులచే రాత్రి షిఫ్టులు పని చేపించుకోవచ్చు. పాత చట్టంలో మహిళల కనీసభద్రత కోసం మహిళలు రాత్రిపూట పనిచేయడంపై ఉన్న ఆంక్షలు, ఇప్పుడీ కొత్త చట్టంలో తొలగించబడ్డాయి.
ఇక కార్మికుల వేతనాల విషయాలకు వస్తే వేతనాల నిర్మాణం (50% నిబంధన): ప్రాథమిక వేతనం (Basic Pay) మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. ఇది కార్మికులకు EPF, మరియు రిటైర్మెంట్ తర్వాత వచ్చే గ్రాట్యుటీ మొత్తాలను మారుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త లేబర్ కోడ్ లలో కార్మికుల జీవితాలను బానిసలుగా మార్చే ,వారి శ్రమను దోపిడి చేసే అనేక అంశాలు ఇమిడి ఉండగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాత్రం ఈ కొత్త చట్టాల వల్ల పెట్టుబడులు పెరుగుతాయని, అసంఘటిత రంగ కార్మికులకు (గిగ్ వర్కర్స్, డెలివరీ బాయ్స్) సామాజిక భద్రత కలుగుతుందని చెబుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం ఈ 4 కొత్త లేబర్ కోడ్ లు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమేనని, కార్మికుల హక్కుల సాధన కోసం విశాల ప్రజారాశులు, కమ్యూనిస్ట్ పార్టీలు వారి కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా వచ్చిన పాత చట్టాలను రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కొత్త లేబర్ కోడ్స్ వలన కార్మికులు దినదిన గండంగా బానిసలు మారే ప్రమాదముతో పాటు ఈ కొత్త చట్టాల వల్ల కార్మికుల హక్కులు, భద్రత, సామాజిక భద్రత తగ్గిపోతాయని, యాజమాన్యాల ఇష్టారాజ్యం పెరుగుతుందని భారత దేశం 10 ప్రధాన కేంద్ర కార్మిక సంఘాల(Central trade Unions ఉమ్మడి అందులో ప్రధానంగా AITUC, INTUC CITU, HMS, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF , UTCUC లు ఫిబ్రవరి 12 న అఖిల భారత సమ్మె కు పిలుపినిచ్చారు. ఈ సమ్మె కు దేశంలో అనేక ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు,రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) మరియు అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఈ సమ్మెకు పూర్తి మద్దతునిచ్చాయి. ఈ సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), AIBOA మరియు BEFI వంటి సంఘాలు పాల్గొన్నాయి.
వీటితో పాటు విద్యార్థి, మహిళా, యువజన సంఘాలు కూడా తమ సంఘీభావం తెలిపాయి ఈ సమ్మె
పిలుపునందుకొన్న దేశ ప్రజలు కార్మికులు ట్రేడ్ యూనియన్ల అంచనా ప్రకారం 30 కోట్ల మంది కార్మికులు, రైతులు, మిగతా అనేక రంగాల ప్రజలు సమ్మె నిరసనల్లో పాల్గొని విజయవంతం చేశారు. దేశంలోని దాదాపు 600 జిల్లాల్లో 2,000 కంటే ఎక్కువ చోట్ల నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు జరిగాయి.
మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీరుని గమనిస్తే కార్పొరేట్ మిత్రులు ఆదాని, అంబానీ లాంటి వారికోసం దేశంలో పరిపాలన కొనసాగిస్తోంది. మధ్యభారత దేశంలో అటవీ, ఖనిజ సంపదను కార్పొరేట్ లకు అప్పగించడం కోసం ఆదివాసీలను, మావోయిస్టుల పేరుతో నిర్వాసితులను చేస్తూ అంతం చేయడంకోసం ఆపరేషన్ కగార్ పేరుతో లక్షలాది బలగాలతో ఓ హత్యాకాండ కోనసాగిస్తుంది. మరోపక్కన దేశంలోని కోట్లాదిమంది శ్రామికులను బానిసలుగా చేస్తుంది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక కర్షక లోకం 29 పాత కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 4లేబర్ కోడ్లను రద్దు చేయాలని , విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, కనీస వేతనాల అమలు మరియు ప్రైవేటీకరణను అపాలనే డిమాండ్ తో జరిగిన ఈ అఖిల భారత సమ్మే కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి
కార్మిక రైతాంగ శక్తిని చూపించి భారీ హెచ్చరికను చాటింది. అయితే ఇది ఒక పోరాట సంకేతం మాత్రమే. ఈ సమ్మె తర్వాత కూడా కార్మికవర్గం ఆలోచించుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. పోరాటాన్ని ఆపకుండా కొనసాగించకపోతే కార్పొరేట్ రాజ్యం లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోదు. ఇటీవలి సమ్మె తో ఆలాంటి పోరాటానికి నాందీ కావాలి. కార్మికవర్గం తన హక్కుల కోసం అప్రమత్తం




