1980ల నుండి ‘పనికి ఆహారం’ తదితర పేర్లతో కొనసాగిన పథకానికి 2006 సంవత్సరంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్(యుపిఎ) ప్రభుత్వం… గ్రామీణ ఉపాధి హామీ పథకంగా అమలు చేసింది. ప్రజానుకూల ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల ప్రొద్భలంతో గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో రూపుదిద్దుకుంది. 2009 సంవత్సరంలో ‘మహాత్మా గాంధీ’ పేరును పథకానికి ముందు జోడించింది. ఎం.జి నరేగా (గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ఉపాధి అవకాశాలను కల్పించడంలో ప్రకటిత లక్ష్యపు దరిదాపులకు కూడా చేరుకోకపోయినప్పటికీ, ఎన్నో అవకతవకలు, లోటుపాట్లతో అవినీతిలో కూరుకుపోయినప్పటికీ… దేశంలోని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజానీకానికి ఏదో మేరకు ఉపశమనంగా పనిచేస్తోంది. ఈ పథకాన్ని సైతం కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మరింతగా నీరుగార్చేలా చూస్తోంది. అందులో భాగమే ఈ చట్టాన్ని రద్దుచేసి అసందర్భంగా, కృతకంగా, చౌకబారుగా రాముని పేరు స్పురించేలాగా ‘విబి-జి రామ్ జి’ పేరిట నూతన చట్టాన్ని ప్రజలపై రుద్దింది. మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది మొదలు ఈ పథకానికి నిధులు ఎండగట్టడం ద్వారా దాని పీకనులమడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికీ అది గ్రామీణ పేదలకు రూ. 8,000 కోట్ల బకాయిపడిందంటే పేదలపై దీని అక్కసు ఎంతో అర్థమవుతుంది.

2006 ఫిబ్రవరి 2న  గ్రామీణ ఉపాధికి హామీ ఇచ్చే ‘ఎంజి నరేగా’ చట్టం వచ్చినప్పుడు, దేశ చరిత్రలో ఒక కీలక మలుపుగా పేర్కొన్నారు. గ్రామీణ పేదల కోసం వచ్చిన అతికొద్ది చట్టాలలో ఉపాధి హామీ చట్టం ఒకటి. ఈ చట్టం బాగా అమలు జరిగిన చోట పేదల వలసలు బాగా తగ్గాయి. కొనుగోలు శక్తి పెరిగింది. ఈ చట్టాన్ని సామాజిక మేధావులు కొనియాడారు. కానీ మోదీ సర్కారు ఆ ఉన్నతాశయంతో చేసిన చట్టాన్ని అటకెక్కించి, ‘విబి జి రామ్ జి’ని ప్రవేశపెట్టడం ముమ్మాటికీ పని హక్కుపై ఉక్కుపాదం మోపడమే. గ్రామీణ భారత సమాజంలో ఉపాధి అనేది కేవలం ఆదాయం పొందే మార్గంగా మాత్రమే గాక, జీవన భద్రత, ఆత్మ గౌరవం, సామాజిక స్థిరత్వం, ప్రజాస్వామ్య భాగస్వామ్యం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న ఓ కీలక అంశం. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘ఎంజి నరేగా’ గ్రామీణ పేదలకు పని బిక్ష కాదు, హక్కు అనే భావనను అందించింది. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మాత్రం మారిన గ్రామీణ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రెండు దశాబ్దాల క్రితం తెచ్చిన పాత చట్టం స్థానంలో సరికొత్త ఆదర్శాలు, లక్ష్యాలతో ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నామని బుకాయిస్తోంది.

గ్రామీణ పేదల పనిహక్కుకు చట్టబద్ధమైన హామీనిచ్ౘ్ిన, స్థానిక ప్రజాస్వామ్యానికి సాధికారత కల్పించిన, ఉపాధి కల్పనను దయా భిక్షంగా కాకుండా ఒక హక్కుగా గుర్తించిన అరుదైన చట్టమది. ఆ విశిష్ట శాసన దార్శనికతను మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్)’ బిల్లు కూల్చివేసింది. వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తున్న డిమాండ్ -ఆధారిత ఉపాధి హామీ చట్టం స్థానిక స్వపరిపాలనను పటిష్టపరిచింది. స్థానిక అవసరాలకు ప్రాధాన్యమిచ్చే, వాటి ప్రాతిపదికన ‘ఉపాధి హామీ’ పనులకు ప్రణాళికలు రూపొందించి, వాటి అమలును పర్యవేక్షించడం వల్ల గ్రామ పంచాయత్‌ల పాలనా సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. పాలనా వ్యవహారాలలో పారదర్శకత కూడా పెరిగింది. సామాజిక తనిఖీలు దృఢంగా ఉన్నచోట పాలనా వికేంద్రీకరణ మరింత మెరుగైన ఫలితాలను సాధించింది. కరువు పీడిత మండలాల్లో నీటి సదుపాయాలు మెరుగుపడ్డాయి.  మోడీ సర్కార్ ప్రతిపాదించిన కొత్త బిల్లు ఈ పునాదులను కూల్ౘ్ి వేసింది.

రెండు దశాబ్దాల పాటు ఆ చట్టం గ్రామీణ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది. పాత చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావడం పట్ల ఇప్పుడు సహజంగానే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకత వెనుక రాజకీయ భావోద్వేగాలు కంటే లోతైన సామాజిక, ఆర్థిక, రాజ్యాంగ సంబంధిత కారణాలే  ఎక్కువగా ఉన్నాయి. పాత గ్రామీణ ఉపాధి చట్టం ఒక హక్కు ఆధారిత చట్టం. గ్రామీణ ప్రాంతంలో నివసించే ఏ పౌరుడైనా పని కావాలంటూ దరఖాస్తు చేస్తే, నిర్దిష్ట కాలవ్యవధిలో (15 రోజుల్లో) పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండేది. పని ఇవ్వకపోతే పరిహారం చెల్లించాల్సిన నిబంధన కూడా ఉండేది. ఈ చట్టం ఒక సంక్షేమ పథకం కాదు. ఒక చట్టబద్ధమైన హక్కు. ఈ భావన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల నుంచి ప్రేరణ పొందింది. గ్రామీణ పేదరికాన్ని ఎదుర్కొనే బాధ్యత రాష్ట్రానిదే అనే భావన దీనిలో నిక్షిప్తమై ఉంది. కొత్త చట్టం ఈ హక్కు భావనను బలహీనపరుస్తోంది. ఇప్పుడు పని పౌరుల డిమాండ్ ఆధారంగా కాకుండా, ప్రభుత్వ ప్రణాళికలు, బడ్ౙెట్ పరిమితులు, ఎంపిక చేసిన ప్రాంతాల ఆధారంగా మాత్రమే అందుబాటులోకి వస్తుంది.

నూటికి 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపవడిన దేశం మనది. 26 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అనేక లెక్కలు చెబుతున్నాయి. మన లాంటి దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఏడాదికి 100 రోజులు హక్కుగా పని కల్పించిన చోట పేదల కొనుగోలు శక్తి పెరిగింది. వలసలు తగ్గాయి, సంపన్నులతో పేదలు బేరమాడే శక్తి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఎకరాల సన్న, చిన్నకారు రైతుల భూములు అభివృద్ది కావడమే కాకుండా పంటల కాలువలు, చెరువుల పూడికలు తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు మన లాంటి దేశంలో వాటిని తట్టుకుని నిలబడటానికి గ్రామీణ ఉపాధి హామీ చట్టం తోడ్పడింది. రెండు దశాబ్ధాలుగా  వ్యవసాయ కూలీలకు ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక స్వావలంబనను, భూస్వామ్య బంధనాల నుండి స్వేచ్ఛ కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన చట్టాన్ని ఎటువంటి భరోసా ఇవ్వలేని, పరిమిత బడ్జెట్ పథకంగా మార్చి వేశారు.

పాత చట్టంలో డిమాండ్ ఆధారిత ఉపాధి ఒక కీలక అంశంగా ఉండేది. గ్రామంలో వర్షాలు పడకపోయినా, పంటలు నష్టపోయినా, మార్కెట్ పరిస్థితులు దెబ్బతిన్నా, ప్రజలు వెంటనే పని కోరగలిగేవారు.  పని అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకున్న కారణంగా, ఖర్చును కూడా పెంచేవారు. కొత్త విధానంలో ముందుగా కేటాయించిన బడ్ౙెట్ మేరకే పని ఉంటుంది. ఎంత అవసరం ఉన్నా  కేటాయింపు పూర్తయిన తర్వాత పని నిలిచిపోతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రకృతి మీద, వ్యవసాయం మీద ఆధారపడి సాగుతోంది. అక్కడ అవసరాలు ముందుగా అంచనా వేయడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో హక్కు  స్థానంలో పరిపాలనా హామీ మాత్రమే ఉండటం పేదల భద్రతను తగ్గిస్తుంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు రెండు నెలలు ఉపాధిని పూర్తిగా నిలిపివేయడం కొత్త చట్టంలో మరో ప్రధాన అభ్యంతరం. ఈ విరామం వ్యవసాయ పనుల కాలంతో ముడిపడి ఉందని చెప్పబడుతున్నప్పటికీ, వాస్తవ ప్రభావం మాత్రం భిన్నంగా ఉంటుందని విమర్శకులు అంటున్నారు.            

గ్రామీణ ఉపాధి హామీ ఉన్నప్పుడు, కూలీలకు ఒక ప్రత్యామ్నాయ అవకాశం ఉండేది. వ్యవసాయ యజమానులు తక్కువ  కూలి ఇవ్వాలనుకుప్పుడు, కూలీలు ప్రభుత్వ పనికి వెళ్లే అవకాశం ఉండేది. ఈ పరిస్థితి వల్ల కూలీలకు తమదైన ఎంపిక ఉండేది. కొత్త వ్యవస్థలో రెండు నెలల విరామంతో కూలీలు పూర్తిగా ప్రైవేట్ యాజమానులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల తక్కువ వేతనాలు, అసురక్షిత పనిపరిస్థితులు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భూమిలేని కూలీలు ఈ మార్పుతో ఎక్కువగా నష్టపోతారు. పాత చట్టంలో గ్రామ పంచాయితీల పాత్ర అత్యంత కీలకం. గ్రామానికి ఏ పనులు అవసరం, ఎక్కడ నీటి సంరక్షణ చేయాలి, ఏ రహదారి అవసరం, ఏ చెరువు పూడిక తీయాలి వంటి నిర్నయాలు గ్రామ స్థాయిలోనే తీసుకునేవారు. ఈ ప్రక్రియలో గ్రామ సభలు, ప్రజల భాగస్వామ్యం బలోపేతమైంది. కొత్త చట్టంలో ఈ అధికారాలు పై స్థాయికి వెళ్లిపోవడం ఆందోళనకరం. పనుల ప్రణాళికలు, ప్రాధాన్యతలు కేంద్రస్థాయిలో జరిగితే, గ్రామ పంచాయితీలు కేవలం అమలు చేసే యంత్రాంగంగా మారిపోతాయి. ఇది భారత రాజ్యాంగంలో ప్రతిపాదించిన వికేంద్రీకరణ సూత్రాలకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి.

కార్మికులకు ఇచ్ౘ్ే వేతనాలలో 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానివే. కానీ కొత్త బిల్లు సెక్షన్ 4(5) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని డిమాండును బట్టి నిధులు కాకుండా రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తుంది. ఉదా: కేరళ లాంటి వామపక్ష పాలన, లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఈ చట్టం ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 4(6) ప్రకారం, కేటాయింపుల్లోని మొత్తం కంటే ఎరక్కువ ఖర్చుపెడితే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నిధులు ఇచ్చే పరిస్థితిని కల్పిస్తుంది. అంటే డిమాండ్‌ను బట్టి నిధులు ఇచ్చే పద్దతికి బదులు, కేటాయింపులకు అనుగుణంగా డిమాండ్‌ను సర్దుబాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. కొత్త బిల్లు సెక్షన్ 5(1)  ప్రకారం ఎక్కడ పని కల్పించాలో కేంద్ర ప్రభుత్వం నోటిపై చేసిన ప్రాంతాల్లో మాత్రమే కల్పిస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని నోటిపై చేయలేదో ఆ ప్రాంత ప్రజలకు పని హక్కు ఉండదు. అంటే సార్వజనీనంగా, సార్వకాలీనంగా ఉన్న హామీని కాలరాసి ఇతర సాధారణ పథకం లాగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చేసింది.

ఆర్థిక కోణంలో చూస్తే, రాష్ట్రాలపై పెరుగుతున్న వ్యయం మరో ప్రధాన సమస్యగా మారింది. పాత చట్టంలో రాష్ట్రాల వాటా (10 శాతం)  కేంద్రం 90 శాతం ఖర్చు భరించేది. దీనివల్ల ఆర్థికంగా బలహీనమైన రాష్ట్రాలు కూడా ఉపాధి పనులను విస్తృతంగా అమలు చేయగలిగాయి. కొత్త చట్టంలో రాష్ట్రాలపై భారీ వ్యయాన్ని (40 శాతం) మోపుతున్నారు. ఇప్పటికే అప్పులు, ఆదాయ లోటు, సంక్షేమ వ్యయాలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు ఇది అదనపు భారం కానుంది. సంక్షేమ వ్యయాలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు ఇది అదనపు భారం అవుతుంది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలు ఖర్చును భరించలేక పనులను పరిమితం చేసే అవకాశం ఉంది. అలా జరిగితే ఉపాధి హక్కు కాగితాలకే పరిమితమైన వాస్తవంలో గ్రామీణ పేదలకు అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. పారదర్శకత, సామాజిక తనిఖీల విషయంలో కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ఆస్తుల సృష్టి విషయంలో కూడా పాత చట్టం కీలక పాత్ర పోషించింది. చెరువులు, కాలువలు, గ్రామ రహదారులు, నీటి సంరక్షణ నిర్మాణాలు వంటి ఆస్తులు ఈ చట్టం ద్వారా వృద్ధి చెందాయి. ఇవి కేవలం ఉపాధి కల్పించడమే కాకుండా, దీర్ఘకాలిక గ్రామీణ అభివృద్ధికి పునాదిగా నిలిచాయి.

Leave a Reply