గాలి ఒక్కసారిగా 
సుళ్ళు తిరుగుతూ
సాగరాన్ని తాకుతుంది

సాగరం తన లోలోపలి
అలజడితో ఎగసిపడుతూ
నింగిని ముద్దాడుతుంది

పగిలిన పెదవితో
నింగి అరణ్యాన్ని
కౌగిలించుకుంటుంది

అరణ్యం తన
చేతులలో నిన్ను
పొదువుకుంటుంది

నువ్వు మరోసారి
నదిగా మారి
పల్లంవైపు ఉరకలేస్తావు!!

Leave a Reply