2025 నవంబరు 18నాడు స్థానిక ఆదివాసీ కార్యకర్త, నక్సలైట్ నాయకుడు మడావి హిడ్మా, అతని కామ్రేడ్, జీవన సహచరి మడకాం రాజేని మరో 11 మందిని చంపినట్లు భారత రాజ్యం విజయవంతంగా ప్రకటించింది. ఈ సైనిక ‘విజయం’తో, భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేయడానికి హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన 2026 మార్చి 31 గడువును విజయవంతంగా చేరుకుంటున్నట్లు బిజెపి ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర అట్టడుగు వర్గాలను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న పెట్టుబడిదారులు భూమిని, సహజ వనరులను స్వాధీనం చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి బిజెపి ప్రభుత్వ అణచివేత విధానాలలో భాగమే ఈ ప్రకటన.

హిడ్మా తదితరులను నిరాయుధాలుగా పట్టుకుని ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మారేడుమిల్లి అడవులకు తీసుకెళ్లి, అక్కడ రెండు రోజుల పాటు వారిని రెండు గుంపులుగా విభజించి, హింసించి, అన్యాయంగా హత్య చేశారని తీవ్రంగా విమర్శించిన ఆదివాసీ గ్రామస్తులు, మానవ హక్కుల కార్యకర్తలు, భారతీయ పౌర సమాజం పక్షాన మేము ఈ పత్రంపై సంతకం చేశాం. కొద్దిసేపటి క్రితమే ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి బస్తర్ డివిజన్ లోని సుక్మా జిల్లా లోని పువర్తి లోని హిడ్మా గ్రామానికి వెళ్లారు. రాజకీయ నాటక ప్రదర్శనలో భాగంగా ఆయన తల్లి మడావి పొజ్జీతో కలిసి భోజనం చేశారు.

2024 జనవరి నుంచి భారత రాజ్యం తన సైనికీకరణ చెందిన పోలీసులకు “హత్యలకు ప్రతిఫలం” విధానం కింద ఆదివాసీ ప్రజలను (నక్సలైట్ కేడర్లు, గ్రామస్థులు) చట్టాతీత హత్యలు చేస్తోంది. ఈ హత్యలకు ముందు తరచుగా అరెస్టులు, హింసలు జరుగుతున్నాయని గ్రామస్తులు, పౌర సమాజం చెబుతుంటే, భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఎదురు కాల్పులు లేదా ఎన్కౌంటర్ అని రాజ్యం అంటోంది. 2025 సెప్టెంబర్ వరకు మరణించిన 550 మందిలో ఎక్కువ మంది దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని పర్యావరణపరంగా సున్నితమైన, జీవ వైవిధ్యమైన, ఖనిజ సంపన్నమైన అనేక గోండు, మురియా ఆదివాసీ సముదాయాలు జీవించే అటవీ కొండలలో మరణించారు.

2024-2025 సంవత్సరానికి గాను బస్తర్ పోలీసుల చర్యలు, ఫలితాల నివేదిక ప్రకారం 2024లో మాత్రమే, రిపోర్టు అయిన “ఎన్కౌంటర్లు” 2023లో 68 నుంచి 2024లో 121కి రెట్టింపు అయ్యాయి. చట్టాతీత హత్యలు జరిగిన చాలా మంది మృతదేహాలు కుళ్ళిపోవడానికి వదిలేసారు; పురుగులు పట్టాయి; కుటుంబ సభ్యులు గుర్తించడం దాదాపు అసాధ్యమైపోయింది.

బంధించిన, చిత్రహింసలకు గురి చేసిన సాక్ష్యాలను చెరిపివేయడానికి, బహిరంగ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరుకాకుండా నిరోధించడానికి కొన్ని మృతదేహాలను బలవంతంగా దహనం చేశారు.

చిత్రహింసల, చట్టాతీత హత్య సాక్ష్యాలను తుడిచివేయడానికి, మడావి హిడ్మా, మడకాం రాజే మృతదేహాలను హిడ్మా గ్రామమైన బస్తర్, సుక్మా జిల్లాలోని పుర్వత్తికి త్వరగా దహనం చేయడానికి తిరిగి పంపారు. అయినప్పటికీ వేలాది మంది ఆదివాసీలు తమ చివరి నివాళులర్పించేందుకు హాజరయ్యారు.

నక్సలైట్లను స్థానిక రాజ్యేతర సాయుధ  వ్యక్తులుగా పరిగణించి, అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం రాజ్య వ్యతిరేక తిరుగుబాటు కార్యకలాపాలుగా  గుర్తించకుండా, భారతదేశం జెనీవా కన్వెన్షన్ సాధారణ ఆర్టికల్ 3, అదనపు ప్రోటోకాల్ II కింద తన బాధ్యతలను తప్పించుకుంటుంది. బదులుగా, లొంగిపోయిన నక్సలైట్లను “జిల్లా రిజర్వ్ గార్డ్” గా తిరిగి ఆయుధీకరించడంతో సహా బేషరతుగా లొంగిపోయే “పునఃఏకీకరణ” దేశీయ విధానాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తుంది.

స్థానికుల సామాజిక-రాజకీయ దోపిడీలో బస్తర్‌లో నక్సలైట్ ఉద్యమం వేళ్ళూనుకొన్నప్పటికీ, ఇది సామాజిక న్యాయంపైన కేంద్రీకరిస్తుంది; బస్తర్‌ను వనరుల వెలికితీత ప్రదేశంగా చూసే గని, పారిశ్రామిక సంస్థల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి భారత రాజ్యం రాజకీయ పరిష్కారాన్ని తప్పించుకుంటూనే ఉంది,.

బదులుగా, “అపరిమిత లొంగిపోవడం” లేదా “చంపడం” అనే విధానం మొత్తం ఆదివాసీ సమాజాలను లక్ష్యంగా చేసుకుని, కార్పొరేషన్ల ప్రవేశాన్ని అడ్డుకున్న తిరుగుబాటు ఉద్యమానికి మద్దతు లేకుండా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

కార్పొరేట్ కంపెనీల  ప్రవేశాన్ని ప్రతిఘటించిన తిరుగుబాటు ఉద్యమానికి మద్దతు లేకుండా చేయడానికి, వారిని ఏకాకుల్ని చేయడానికి ‘షరతులు లేని లొంగిపోవటం’ లేదా ‘చంపబడటం’ అనే విధానం మొత్తంగా ఆదివాసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుంటుంది.

బస్తర్‌లోని ఆదివాసీల జీవితాలు, జీవనోపాధికి సంబంధించిన ప్రతి అంశాన్ని సైనికీకరణ ఇప్పుడు నిఘా, పరిమిత కదలిక, భయం, ఏకపక్ష నిర్బంధాలు, చట్టాతీత హత్యలు, లైంగిక హింసల రూపంలో వ్యాపించింది. మిలిటరీ భద్రతా దళాలు మానవ హక్కులను ఉల్లంఘించడంతో పాటు, కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయవ్యవస్థల మధ్య కుట్ర కూడా ఉంది. శాంతి నెలకొనబోతోందని రాజ్యం ప్రజలకు భరోసా ఇస్తున్నప్పటికీ, అలా కాకపోవడంతో ఈ కుట్రలు మరింత తీవ్రమవుతున్నాయి.

గత రెండు దశాబ్దాలుగా, అనేక కార్పొరేట్ కంపెనీలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. టెండర్‌లు/కేటాయింపుల ప్రక్రియలు రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలను మరియు అంతర్జాతీయ స్వేచ్ఛాయుత, పూర్వ, మరియు సమాచారంతో కూడిన సమ్మతి – (ఎఫ్‌పిఐసి – ఇది ముఖ్యంగా భూమి, వనరులపైన ప్రభావం చూపే ప్రాజెక్టులకు ముందు ఆదివాసీ, స్థానిక ప్రజల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణం.) ప్రమాణాలను నిరంతరం ఉల్లంఘిస్తున్నాయి. షియోనాథ్ వంటి మొత్తం నదులను ప్రైవేట్ కంపెనీలకు అమ్మేసారు. 2022–2023లో, ఛత్తీస్‌గఢ్ ఖనిజ ఆదాయం రూ. 12,941 కోట్లకు [అమెరికా డాలర్లు 153 మిలియన్లు] చేరుకుంది, ఇందులో దాదాపు సగం బస్తర్ దంతెవాడ జిల్లా నుండే వచ్చింది. అయినప్పటికీ, ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలు అత్యంత పేదరికంలో ఉన్న భారతీయ ప్రజలలో ఉన్నారు. అక్షరాస్యత, ఆరోగ్యం వంటి మానవ అభివృద్ధి సూచికలు, బస్తర్‌లోని ఏడు జిల్లాలలో దేశంలోనే అత్యల్పంగా ఉన్నాయి.

ప్రభుత్వ-కార్పొరేట్ సంపద పెరుగుతున్న, స్థానిక అస్తిత్వ ఏజెన్సీ (సొంత ఉనికి) తగ్గుతున్న ఈ సందర్భంలోనే, న్యాయ ఆధారిత శాంతికి అవకాశం లేకుండా చేసే ‘అభివృద్ధి హింస’ విధానానికి వ్యతిరేకంగా బస్తర్ ఇప్పటికీ ఆదివాసీ సామాజిక-రాజకీయ పోరాటాలకు ముఖ్య కేంద్రంగా కొనసాగుతోంది. ఈ అభివృద్ధి హింసలో బస్తర్‌లోని యువత నేతృత్వంలోని సామూహిక సమీకరణలను ఉద్దేశపూర్వకంగా కూలదోయడం, ఆదివాసీ యువ నాయకులు/కార్యకర్తలను ‘ఉగ్రవాదం’ ఆరోపణల కింద విస్తృతంగా అరెస్టు చేయడం; ఆదివాసీ ప్రాబల్యం గల ప్రాంతాలను పూర్తిస్థాయిలో సైనికీకరించడం వంటివి ఉన్నాయి. ఈ విధంగా, భారత రాజ్యం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం ఆదివాసీల భూ హక్కులను, మానవ, పౌర, రాజకీయ హక్కులను వ్యవస్థీకృత పద్ధతిలో చెరిపివేస్తోంది. గత రెండు దశాబ్దాలుగా, ప్రతి ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 హామీ ఇచ్చిన జీవించే హక్కును, అంతర్జాతీయ చట్టాలు, చార్టర్‌ల ప్రకారం భారతదేశ బాధ్యతలను ఉల్లంఘించింది.

భారతదేశాన్ని వెంటనే ఈ క్రింది డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా డిమాండ్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం.

•అన్ని రకాల హింసను – అంటే చట్టాతీత హత్యలను, అక్రమ అరెస్టులు, హింస వంటి వాటిని ఆపివేయాలి; బస్తర్‌లోని ప్రభుత్వ సైనికీకరణను (నిలిపివేయాలి.

•మాడ్వి హిడ్మా, మడకం రాజే సహా, ఆపరేషన్ కగార్ పేరుతో జరిగిన అన్ని అక్రమ హత్యల పరిస్థితులపై స్వతంత్ర న్యాయ విచారణను జరపాలి. ప్రభుత్వ బలగాలను వారి చర్యలకు బాధ్యులను చేయాలి.

•రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వయంప్రతిపత్తి, భూ హక్కులు, సహజ వనరులపై హక్కుల డిమాండ్లను నిజాయితీగా పరిష్కరించడానికి ఆదివాసీ సముదాయాలతో సంభాషణ, రాజకీయ నిమగ్నతను ప్రారంభించాలి.

సంతకం చేసినవారు.

ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకడమిక్ ఫ్రీడం ఇన్ ఇండియా (ఇన్సాఫ్ ఇండియా), ఇండియా లేబర్ సాలిడారిటీ (యు కె), 12ummah.com, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్, స్విట్జర్లాండ్, ఇండియన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ యుకె, ఇండియాయ్న్ వర్కర్స్ అసోసియేషన్ జిబి, అంనెస్టీ ఇంటర్నేషనల్, జర్మనీ

2025 నవంబర్ 27

Leave a Reply