కలీం కవితలు రెండు
1. కొత్తకాదుఎన్ని ఆటుపోట్లుఎన్ని సంక్షోభాలుఎంత నిర్బంధంఎంత రక్త దారపోతఆటుపోట్లను అధిగమించిసంక్షోభాలను చిత్తుచేసినిర్బంధాన్ని బడ్డలుకొడుతూత్యాగాలతో ఎరుపెక్కిందినక్సల్బరీలో ముగిసిందన్నారుశ్రీకాకుళంలో మొదలుకాలేదా..శ్రీకాకుళంలోవెనకడుగు వేసిందనుకుంటేసిరిసిల్ల, జగిత్యాలలోజైత్రయాత్ర కాలేదా..జంగ్ సైరనూదలేదా..?నల్లదండులు, నయీమ్ ముఠాలుగ్రీన్ హంట్ లు, సల్వాజుడుంలుఆపరేషన్ ప్రహార్లు,ఆపరేషన్ సమాధాన్ లు,అన్నిటిని ప్రజా యుద్ధంతోనేఎదుర్కోలేదా..జనతన సర్కార్ లను ఏర్పరచలేదా..?లొంగుబాట్లు, కుంగుబాట్లువెన్నుపోట్లు, వెనకడుగులుఇవేవీ కొత్తకాదుప్రతీది ఒక గుణపాఠమేగుణపాఠం నుండే కదావిప్లవ పురోగమనంఖచ్చితంగా పురోగమిస్తాంపురోగమిస్తూ విస్తరిస్తాం. 2. అడవివెన్నుపోటుతో అడవికుంగిపోతుందిదోసుకునే దోపిడిగాళ్లకుదారి చూపుతున్న ద్రోహులను చూసి దుఃఖిస్తుంది.తన ఒడిలోని బిడ్డలనుఒక్కొక్కరిని కూల్చుతుంటేతల్లికోడిలా తల్లడిల్లుతుంది.తేదీలను బెట్టితుడిచేస్తామంటూకుట్రదారులు, పెట్టుబడిదారులుఒక్కటై వస్తూ ఉంటేతన బిడ్డల త్యాగాలతోతడిసిన అడవిసగర్వంతో ఎర్రబడిపోరుకు సై అంటున్నదివాడు చిగురించేఆకులను తుంచేస్తేనేను మళ్ళీగర్జించే గన్నులనుకంటానంటున్నది.




