stories

అయ్యో రామ!

“ఏమైపోయావురా? నేన్నిన్ను పోల్చుకోలేకపోయాను తెలుసా?” నమ్మలేనట్టు యెగాదిగా చూస్తూ అడిగాడు బట్టతలమనిషి. చింపిరిజుట్టూ గడ్డంతోవున్న మనిషి యేమీ మాట్లాడలేదు. పుసులు కట్టిన అతని లోతు కళ్ళలో తడి. బలహీనంగా వున్నాడు, మాసిన దుస్తుల్లో. కాలాన్ని అందుకోవాలన్నట్టు రైలు దూసుకుపోతోంది. ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. బహుశా వాళ్ళు వాళ్ళ బాల్యపు బావుల్లో పడి కొట్టుకుంటున్నట్టున్నారు. తగ్గిన స్లీపర్ కోచ్‌లవల్ల కాస్తంత రద్దీగానే వుంది బోగీ. బట్టతలమనిషి తన వుద్యోగము గురించి చెప్పాడు. ఆతరువాత పిల్లల చదువుల గురించి అలాగే అనుకూలవతయిన భార్య గురించి చెప్పాడు. అన్నిటికీ సమాధానంగా జీవంలేని నవ్వు ముఖంతో చూశాడు చింపిరిజుట్టు గడ్డంమనిషి. “అది అట... యిదట
కవిత్వం

వాళ్లెక్కడ లేరు?

పసిపాప పాల కోసం ఏడిస్తేతల్లి పాడే జోల పాటలో వారున్నారుబంజరు పట్టిన నేలనుపంటగా మార్చే రైతన్న నాగలిలో ఉన్నారు కొంగు నడుముకు సుట్టుకునిబురదలో నాట్లేసే నాటు పాటలో ఉన్నారు కులం పేర దాడి జరిగితేఆత్మగౌరవం కోసం చేసేపోరాటపు డప్పులు ఉన్నారుఅత్యాచారం చేయబడిన స్త్రీలతిరుగుబాటు పిడికిళ్లలో వారున్నారుపింఛన్ కోసం వెళితేలంచాలకు మరిగిన ఆఫీసర్లనునిలదీతలో వారున్నారుడిమార్ట్లో, ట్రెండ్స్లో చాలీ చాలని జీతాలతో బతుకీడుస్తున్నప్రతి కార్మికుడి కష్టంలో ఉన్నారు అందరికీ దిక్సూచిగా ఉన్నఎర్రని జెండాలో వారున్నారు.
వ్యాసాలు

అన్ని వర్సిటీలనూ అభివృద్ధి చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 10 వ తేదీన, ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు.అంతకు మూడు నెలల ముందు ఆగస్టు 25 వ తేదీన కూడా ఓయూలో పర్యటించి ఓయూ అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇస్తే అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామని, తాను మళ్లీ డిసెంబర్ 10 నాడు ఓయూ ఆర్ట్స్ కళాశాల వస్తానని, భారీ బహిరంగసభ నిర్వహిస్తానని ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లో వుండకూడదని,ఆ రోజు విద్యార్థులు నిరసన వ్యక్తం
సమీక్షలు

Renuka Becoming Midko

Comrade GumudavelliRenuka (Midko)’s literature is a great contribution to Telugu literature, especially revolutionary literature. It was through Renuka’s stories that everyone came to know that "Midko" means "a firefly." Today, these stories are no longer confined to Telugu speaking states but have crossed the linguistic and regional barriers in the country by being translated into multiple Indian languages. They are even crossing national boundaries and gaining a global readership. However,
కవిత్వం

రూపాంతరం

గాలి ఒక్కసారిగా సుళ్ళు తిరుగుతూ సాగరాన్ని తాకుతుంది సాగరం తన లోలోపలి అలజడితో ఎగసిపడుతూ నింగిని ముద్దాడుతుంది పగిలిన పెదవితో నింగి అరణ్యాన్ని కౌగిలించుకుంటుంది అరణ్యం తన చేతులలో నిన్ను పొదువుకుంటుంది నువ్వు మరోసారినదిగా మారి పల్లంవైపు ఉరకలేస్తావు!!
ఆర్ధికం

డాలర్ ఆధిపత్యానికి తెరపడనుందా ?

ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు 'బలం' అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి యున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. అప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించిన బ్రిటన్, తదితర పశ్చిమ యూరప్ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో పాటు ఐరోపాలోని ఇతర పశ్చిమ దేశాల కరెన్సీల విలువ కూడా క్షిణించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచింది అమెరికా ఒక్కటే. ఆ దేశం దగ్గర
కరపత్రాలు

విప్లవం మన శ్వాస – విప్లవం మన ధ్యాసరండి.. కలబోసుకుందాంభారత ప్రజాయుద్ధం-సమకాలీన సందర్భం

సదస్సు7, డిసెంబర్ 2025 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకాసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు నేల నెత్తుటి చిత్తడిగా మారుతున్నది. చరిత్ర విలపిస్తున్నది. తాను కన్న అత్యుత్తమ వీరుల మరణాలతో బెంగటిల్లుతున్న ది. విప్లవకారుల అమరత్వం మన కాలపు మహా విషాదంగా ఆవరించింది. దీన్ని తట్టుకొని నిలబడటం కష్టమే. కానీ తప్పదు. వందల వేల ఏళ్లుగా మానవాళి మోసుక తిరుగుతున్న స్వప్నం గాయపడిన వేళ చరిత్ర మీద తార్కిక విశ్వాసం నిల బెట్టుకోవాల్సిందే. దుఃఖంతో పూడుకపోతున్న మన కంఠస్వరాన్ని భవిష్యత్ నిర్మాణానికి తగినట్లు సవరించుకోవాల్సిందే. ఇంతటి ఆపద కాలంలో సాయుధ పోరాట
కథలు

దర్శనం!

మంచి సెల్ ఫోన్ కొనాలని గూగుల్‌లో చెక్ చేసి వదిలేశాను. ఆ తరువాత యే వెబ్‌కు వెళ్ళినా సెల్ ఫోన్ యాడ్సే వస్తున్నాయి. సజెషన్ వచ్చింది కదా అని యూట్యూబ్ వీడియో కూడా వోపెన్ చేసి చూసి నా పనుల్లో పడ్డాను. అంతే, యిక యెప్పుడు నెట్‌లోకి వెళ్ళినా సెల్లులే సెల్లులు. సెకండ్ హ్యాండ్ యిల్లు కొనాలని గూగుల్‌లో చెక్ చేసి వదిలేశాను. ఆ తరువాత యే సైట్‌కు వెళ్ళినా రకరకాల యిల్లులు పాతవీ కొత్తవీ వస్తున్నాయి. సజెషన్ వచ్చింది కదా అని యూట్యూబ్ వీడియో కూడా వోపెన్ చేసి చూసి నా పనుల్లో పడ్డాను. అంతే, యిక
వ్యాసాలు

అమ్మాయిలపై పబ్లిక్, డిజిటల్ వేధింపులు

ఈ ప్రపంచంలో అమ్మాయిగా జీవించడం అంటే భయంతో, జాగ్రత్తలతో, అనేక అడ్డంకులతో నడవడం అని చెప్పిన అతిశయోక్తి కాదు. అమ్మాయి ఎంత బలంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా ఆమె బయటికి వెళ్లే ప్రతిసారి, ఫోన్ పట్టుకునే ప్రతిసారి, రోడ్డు మీద నడిచే ప్రతిసారి ఒక చిన్న భయం ఆమె మనసులో ఉండక తప్పదు. ఎందుకంటే పబ్లిక్ ప్రదేశాల్లో జరుగుతున్న వేధింపులు ఏళ్ళుగా ఉన్న, ఇప్పుడు అది కాదు  ఫోన్లలో, సోషల్ మీడియాలో కూడా వేధింపుల రూపం పెరిగిపోయింది. అమ్మాయిలకు రెండు వైపులా ప్రమాదాలు పెరుగుతున్నాయి పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిలపై వేధింపులు చాలా కాలంగా ఉన్నాయి.
సంపాదకీయం

అల్లూరి నుంచి హిడ్మా దాకా అదే రక్తసిక్త చరిత్ర

అమరులు మడావి హిడ్మా, రాజే, సహయోధుల ఎన్‌కౌంటర్‌ హత్యలు ఏ దుర్మార్గమైన సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ బ్రాహ్మణీయ ఫాసిస్ట్‌ స్వభావానికి దాఖలా! రాజ్య వైఖరి ప్రభుత్వాలతో మారుతుందా, మారిన పరిస్థితులతో మారుతుందా? మారిన పరిస్థితులు అంటే ఏమిటి! బిహార్‌ ఎన్నికల తర్వాత, టు లవ్‌ విత్‌ సర్‌ కాదు, సర్‌తో కళ్ళు తెరుచుకున్న ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించమని చెప్తున్నారు. ఎన్నడో చెప్పాడు చారుమజుందార్‌ ఈ మాట. ఎప్పుడో చేసి చూపింది నక్సల్బరీ పంథా. హిడ్మా ఆయన సహాయోధుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు చూడండి. శత్రువు చాలా స్పష్టంగా ఏం చేస్తున్నాడు. 2024 ఎన్నికల ముందు నుంచే