వ్యాసాలు

సవర్ణ ఫాసిస్టుల దుశ్చర్యలకు వ్యతిరేకంగాబహుజనులు మేల్కోవాలి

దళిత బహుజన విద్యార్ధుల పై ఉన్నత విద్యా సంస్థలలో అమలు జరుగుతున్న కుల వివక్షను నిర్మూలించి సమానత్వ భావనలు నెలకొల్పడానికి బహుజనులు, ప్రజాస్వామికవాదులు చేసిన నిరంతర పోరాటాల ఫలితంగా దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ విద్యా కమిటీ చేసిన సిఫార్సులను ఆధారం చేసుకుని ఇంతకు ముందు యూజిసి వివక్ష పరిధిలో ఉన్న ఎస్సి,ఎస్టీలతో పాటు ఓబిసిలను కూడా ఈ సిఫార్సుల పరిధిలోకి చేర్చారు.ఒకప్పుడు దళిత బహుజనులకు విద్య నిషేదించిన మనువాద అగ్రవర్ణాలు నేడు రాజ్యాంగం ప్రకారం లభించిన రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల పట్ల అగ్రవర్ణాల విద్యార్ధులు,అధ్యాపకులు చూపుతున్న వివక్ష,వేదింపులు,దాడులు నిరంతరం జరుగుతూ,ఏటేటా
పాట

నిప్పుకణిక ఉయికే గణేష్ – పాక హనుమంతు

ఓ అమరవీరుడా .. విప్లవ యోధుడా..ఎక్కడున్నవయ్యా మా పాక హనుమంతు..ఎక్కడెలితివయ్య మా విప్లవ బందూకు ..తొమ్మిది నెలలు మోసి నిను కన్నాది నీ తల్లి..అడవే నీ తల్లి అని...పోతివో ఎటువెళ్ళి..2..ఏపుట్టని అడగాలి....ఏ చెట్టుని అడగాలి... నీ జాడ చెప్పమని ఏ అడవిని అడగాలిఎన్ని బాధలున్నా ఆ లక్ష్యపు సాధనలో..2..ఎర్రపూల సంద్రాలుగా నిలిచావు గుండెల్లో ... "ఓ అమరవీరుడా.. విప్లవ యోధుడా" ఎదురుచూసే పుల్లెమ్ల గ్రామమంతా నీకోసం.ఓసారి వచ్చిపొమ్మని నీ ఇల్లు తలుపు తెరిచే..2..ఆదివాసి గొంతుక ...పేద ప్రజల జీవిక....పారె నెత్తుటేరులు..స్వార్ధపు రక్కసి మూకలు మనుషుల ప్రాణాలు తీసి విర్రవగే రాజ్యంలో..2..మానవత్వమైనీవు మనసుల్లో నిలిచావు "ఓ అమరవీరుడా.. విప్లవ యోధుడా"సంపద
కవిత్వం

సట్లెజ్ గాలి

ఎగసిపడి పరుగెత్తుతూ నువు చెయ్యి ఊపినప్పుడు నీ చేలాంచలం అంచు చూసి నా హృదయం కదిలిపోయింది నిన్ను నేను నా శ్వాసలో చూసాను నా కౌగిలిలో రాజభవనాల దుర్గంధ వాసన నీ స్వచ్ఛమైన ఆత్మను స్పృశించలేదు లాహోర్ జైల్లో ఉరితీయబడిన అమరులను తమ విషాద హృదయాలలో దాచుకున్న తీరాలలో నువ్వు పెరిగావు ఇక్కడ ప్రతి ఉదయమూ, మధ్యాహ్నము రాత్రి దు:ఖంలో తడిసిపోయాయి నీ జలాల నుంచి నడచిపోతున్న పసులకాపర్ల పాటలు ఇక్కడినుంచి ఎలుగెత్తుతున్నాయి నీ ఎగురుతున్న పైట అంచులు (తెరచాపలై)నన్ను భావోద్వేగాల ద్వీపానికి చేరుస్తాయి గోధుమ పొలాలలోని చెట్ల ఆవేదనలో నల్లతుమ్మ పూలసువాసనలోనిన్ను చూసాను నువ్వు సదా చాలా
అనువాదం

ఆదివాసుల ప్రతిఘటన నేర‌మైతే అడ‌వి నుంచి జైలుకు

2024 సెప్టెంబర్ 19నాడు మా మట్టి మాలి సురక్ష మంచ్ ప్రముఖ నాయకుడు కార్తీక్ నాయక్‌ను, భారతీయ శిక్షా స్మృతి కింద చట్టవిరుద్ధంగా గుమికూడడం, తీవ్రమైన గాయాలు కలిగించడం, హత్యాయత్నం వంటి అనేక ఆరోపణలపైన అరెస్ట్ చేసారు. సిజిమాలి/తీజ్మాలి కొండలలోని 1,549 హెక్టార్ల భూమిని (ఇందులో 699 హెక్టార్ల స్వచ్ఛమైన అటవీ ప్రాంతం ఉంది) వేదాంత సంస్థ ప్రతిపాదించిన బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా, రాయగడ, కలహండి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఆదివాసీలను నాయక్ సమీకరిస్తున్నారు. అంతకుముందు అదే ఏడాది, 2024 జూన్ 3నాడు మూల్ నివాసీ బచావో మంచ్ (ఎమ్‌బిఎమ్) ఉపాధ్యక్షురాలు సునీత పొట్టంను బీజాపూర్ పోలీసులు
సమీక్షలు

త్యాగాల చరిత్ర తల్లులు-బిడ్డలు

తల్లులు బిడ్డలు రచించినది హుస్సేన్. సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేసిన వ్యక్తి. తల్లులు బిడ్డల మధ్య ఉన్న ప్రేమ కన్నా, తల్లులకై బిడ్డలు చేసిన పోరాటాలు త్యాగాలే ఎక్కువ ఉన్నాయి ఇందులో. తల్లుల కొరకై బిడ్డలు,బిడ్డల కొరకై తల్లులు,తల్లడిల్లిన క్రమం, బిడ్డలు విప్లవంలో ఎదుగుతున్న తీరు చూసి సంతోషించిన తల్లులు, దూరమవుతున్న పిల్లలను చూస్తూ బాధపడతారు.బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. ఈ పుస్తకం కేవలం తల్లులు బిడ్డల మధ్య జరిగినది కాదు. ఇది ఒక తరం ధైర్యానికి సాహసానికి, త్యాగనిరతికి, ప్రతీక ఈ పుస్తకం. ఉత్తర తెలంగాణ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల,మంచిర్యాల, ప్రాంతంలో చెలరేగిన ఉద్యమాల ఊట చెలిమ. సింగరేణి
సమకాలీనం

తుడిచివేతపై తుడిచివేత

'ది లాస్ట్ ప్లే ఇన్ గాజా' నాటకాన్ని ప్రదర్శించడానికి భారత వీసా నిరాకరించబడిన యాంటీ-జయోనిస్ట్ ఇజ్రాయెలీ నాటకకర్త ఐనాట్ వైజ్మాన్ ఈ వ్యాసం రాశారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య, అంటే జయోనిజం - హిందుత్వ మధ్య పెరుగుతున్న బంధం వెనుక ఉన్న అసలు రూపాన్ని ఈ చర్య ఎలా బయటపెడుతుందో ఆమె వివరించారు గత వారం కేరళలో జరిగిన ITFOK ఉత్సవంలో మా నాటకం "ది లాస్ట్ ప్లే ఇన్ గాజా" (గాజాలో చివరి నాటకం) ప్రదర్శించాల్సి ఉండింది. రెండు షోలు జరగాలి. ఈ నాటకం గాజాను తుడిచిపెట్టడానికి సంబంధించిన నాటకం. నాశనమైన దానిని థియేటర్ ద్వారా తిరిగి సృష్టించడానికి
కవిత్వం

నిరంతరాయం

ఈ నేల నేలంతా దుఃఖ నదులే ప్రవహించి ఉండవచ్చు అద్భుతమైన మనుషులు కొందరు మాయమై ఇక కనిపించకనూ పోవచ్చు కానీ మరుక్షణం నుంచే కదా వాళ్ళు మన హృదయాల్లో పురుడు పోసు కుంటున్నది వాని రక్తపు కూటి ఏలుబడికి స్మశాన వైరాగ్యమే వినబడుతూ ఉండవచ్చు అవకాశవాదాలై కొన్నైనా భిన్న స్వరాలు పురివిప్పనూ వచ్చు చరిత్రకు ఇది కొత్తేమీ కాదుకద!తరతరాల దుఃఖపు కన్నీటి బిందువులే ప్రవహించీ ప్రవహించీ అనంతమైన సముద్రమయ్యాకఅనితరమైన అమరత్వమే కదా ఆవిరై మేఘమై పునరావృత మయ్యేదిప్రతీఘాతానికిఓటమి లేనిదెన్నడు?దొంగ దెబ్బలు దగ్గరి దారులు గమ్యానికి చేర్చిందెప్పుడు ఈ చీకటికి చెల్లుచీటీ నమోదు చేయడమే కదా చరిత్రంటే,ఇంత నిరంతరాయంగా జరిగే
వ్యాసాలు

యు జి సి నిబంధనలు-కులవివక్ష: సుప్రీం కోర్టు దృక్కోణం

ఉన్నత విద్యాసంస్థలలో కులవివక్షతను రూపుమాపేందుకై  యుజిసి ఈ  జనవరి 14 న నియమ నిబంధనల విడుదల చేసింది. పై  వాటిపై ఉన్నత కులాలనే వారినుండి తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. అవి కేంద్రప్రభుత్వాన్ని ఇబ్బందులలో పెడుతాయని మనలాంటి వారు భావించినా, వాస్తవంలో అవి మోడీ, షా రాజకీయ ఎత్తుగడలలో భాగమని చెప్పక తప్పదు. గతంలో, 1990 లో మండల్ నివేదికకు వ్య‌తిరేకంగా అగ్రవర్ణ విద్యార్థులురోడ్డు ఎక్కిన విషయం విదితమే.  నాడు వి. పి . సింగ్,  తన పదవిని కోల్పోయేoదుకు సిద్ధమై వాటిని అమలుచేయడం, ఆ తర్వాత కమండల్ ఉద్యమం మొదలు కావడమూ మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు మోదీ,
కథలు

అలర్జీ

తూర్పు దిక్కున సూర్యుడు ఇంకా పూర్తిగా బయటకు రాకముందే, తిరుపతి చుట్టూ ఉన్న శేషాచలం కొండలు గాఢ నిద్రలో ఉన్నట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ కొండల భారీ ఆకారాలు ఆకాశం అంచున ఒక ముదురు రంగు సిరా మరకలా విస్తరించి ఉన్నాయి. పట్టణం ఇంకా పూర్తిగా మేల్కొనలేదు. అప్పుడప్పుడే పాల వ్యానుల శబ్దాలు, పక్షుల కిలకిలలు వినబడుతున్నాయి. ఉదయం 5 గంటలు. అలవాటు ప్రకారం శారద కళ్లు తెరిచింది. ఆమె వయసు 38 ఏళ్లు. చూడటానికి చాలా సాధారణమైన, ప్రశాంతమైన గృహిణి. తిరుపతిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమె నివాసం. బాల్కనీలో నిలబడితే ఎదురుగా భారీగా కనిపించే కొండల వరుస
కవిత్వం

అంతిమయాత్రలు

ఉద్వేగపు అడుగులుఉప్పొంగిన కన్నీళ్లుఊరంతా విషాదందారిపొడవునాప్రతి పల్లెఅమరుడు హనుమంతన్నకిపూలతో, తమ కన్నీళ్లతో విప్లవ నినాదాలతోజేజేలు పలికాయిపుల్లెంల నిండా మోదుగుపూలువిరబూసినట్లుగాఎర్రజెండాల రెపరెపలుఆ ఎర్రజెండాలతోఎర్రబారిన ఆకాశంఎగిసిన ఉక్కు పిడికిళ్లుఅమర్ రహే అమర్ రహేహనుమంతన్న అమర్ రహేదిక్కులు పిక్కటిల్లేలాకళాకారుల ఆటలు పాటలుపోలీసుల పికెటింగ్పల్లె నిండా రాజ్యం ఆంక్షలుఅయినాఉసిల్ల పుట్ట పగిలినట్లుగా15 వేల మంది తరలొచ్చారుఇంతకుహనుమంతన్నఎవరికి ప్రత్యక్షంగా తెలుసు..?ఎవరికీ తెలవదు.కానీ అందరి మనసులనుకలియతిరిగాడుఅందరి ఆలోచనల్లోభాగమయ్యాడుఅందుకే అందరి నోళ్ళలోహనుమంతన్న నిండిపోయాడువాళ్ళ మాటల్లో, వాళ్ళ పాటల్లో. పల్లెలో ప్రతీ ఇల్లుదుఃఖపోయడంప్రతీ వ్యక్తి కన్నీరు కార్చడంఆ కన్నీళ్లలో కామ్రేడ్ల త్యాగాలకు నివాళులర్పించడంమొన్న హిడ్మా,నిన్న హనుమంతన్న అమరులందరిఅంతిమయాత్రలుతెలియజేస్తున్నవి ఒక్కటే.."ప్రజావీరులు మృత్యుంజయులు,విప్లవం వర్ధిల్లునని"