స్పందన

సాయుధపోరాట ఎర్రజెండాను ఎత్తిపట్టిన విరసం మహాసభలు

విప్లవ రచయితల సంఘం (విరసం) 30వ మహాసభలు 2026 జనవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. "భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం" అనే ప్రధాన నినాదంతో జరిగిన సభలు ప్రజల్లో నూతన ఉత్సహాన్ని రేకెత్తించాయి. భారతదేశ ప్రజా రాజకీయాల్లో వర్గపోరాట చైతన్యాన్ని రగిలించిన నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తితో 1970లో విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భవించింది. అప్పటి నుండి నేటి వరకు  55 ఏళ్లుగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,నక్సలిబరీ,శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ జగిత్యాల జైత్రయాత్ర , దండకారణ్య పోరాటాల కొనసాగింపుని, అమరవీరుల త్యాగాల చరిత్రను ప్రజలకు రచనలు, కథలు, పాటల ద్వారా ప్రజలకు అందిస్తూ
కథలు

ష్…

“ఏదీ ‘ఆఁ’ అను...” చెప్పినట్టే ‘ఆఁ’ అని నోరు తెరిచాను. నేనేమీ శ్రీకృష్ణుడిలా మట్టి తినలేదు. ఆ వయసు కూడా కాదు. మా అమ్మ యశోదమ్మ అసలే కాదు. నా నోట్లో విశ్వం కనిపించలేదు. ‘బాపురే పదునాల్గు భువన భాండంబులు’ అని చూసినవాళ్ళూ ఆశ్చర్యపోలేదు. “నాలుకమీద పాచి తప్ప మరేమీ లేదు” మాట విని, ‘ఊర్ధ్వలోకాలూ అధోలోకాలూ వుంటాయా మరి’ అని నేనూ నవ్వుకున్నాను. “పిల్లాడు భయపడకుండా నవ్వుతున్నాడు...” “వయసుకొస్తున్నాడు కదా? అలాగే వుంటుంది...” నవ్వుతూ మాట్లాడుకుంటున్నవాళ్ళనీ వాళ్ళచేతుల్లోవున్న సరంజామాని చూసి చెప్పకేం భయం వేసింది. ప్రోత్సహిస్తూ యెవరో భుజం తట్టారు. “ఏం కాదు, సున్తీ చేసినట్టు... జెస్ట్...
సందేశం

విరసం 30వ మహా సభలకు సందేశం

సాయుధ పోరాట ఎర్రజెండ చిరకాలం వర్థిల్లు గాక! ఈ సంక్షోభానికి పరిష్కారం మరింత దృఢంగా వర్గపోరాట ఉన్నత రూపమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించడమే. భావజాలరంగంలో, సాహిత్య సాంస్కృతిక క్షేత్రంలో ప్రజాయుద్ధ ప్రత్యామ్నాయ సంస్కృతిని ఎత్తిపట్టడమే ఇప్పుడు విప్లవ రచయితల సంఘం తక్షణ, దీర్ఘకాలిక కర్తవ్యం అధ్యక్షా, కామ్రేడ్స్ 56వ ఏట తన ముప్పయ్యవ మహాసభలు నిర్వహించుకుంటున్న విరసం 56వసారి సాహిత్యం కళా, భావజాల రంగంలో తన వర్గ పోరాట కర్తవ్యాన్ని పునరుధ్ఘాటిస్తున్నది. శత్రువ్యూహానికి ఈసారి అంతర్గత ప్రతీఘాతుక సాయుధ విద్రోహ నాయకత్వం క్రియాశీలంగా జతకట్టి తాత్కాలిక సంక్షోభాన్ని, ఇదివరకెన్నడూ లేనంత నష్టాన్ని, పూడ్చుకోవడం కష్టసాధ్యమైన ప్రాణనష్టాన్ని నాయకత్వం నుంచి
వ్యాసాలు

ప్ర‌మాద‌క‌ర‌మైన వికసిత్ భారత్

1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత సుమారు 8 దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో సుమారుగా 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 21 సంవత్సరాలు కాంగ్రేసేతర పార్టీల కూటములు  భారతదేశంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఆర్ఎస్ఎస్ భావజాల బిజెపి కూటమి 18 సంవత్సరాలు పాలన సాగిస్తూ నేడు వారే అధికారంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పంచవర్ష ప్రణాళికలు, జమీందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, సంస్థానాల విలీనం, భూ సంస్కరణలు, గరీబీ హటావో మొదలగు వాటిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది.1975 ఎమర్జెన్సీ తదనంతర  పరిణామాలలో ముఖ్యంగా 
కొత్త పుస్తకం

అస్తిత్వం నుండి విముక్తి దాకా

జైలు కథల అనూరాధగా తెలుగు పాఠకులకు పరిచయమైన బి. అనూరాధ సాహిత్య ప్రస్థానం ఈ సంకలనంలో చూడవచ్చు. హజారీబాగ్ జైలు కథలు తెలుగు కథా సాహిత్యానికి అరుదైన చేర్పు. విప్లవ కథా స్రవంతికి కూడా ఇది సరికొత్త విస్తరణ. మన సాహిత్యంలో ఖైదు కవిత్వం వచ్చినంతగా కథలు రాలేదు. ఎక్కువ మందికి తెలియని ఆ ప్రపంచపు లోతులను ఈ కథలు చూపించాయి. సమాజంలోని సమస్త ఆధిపత్యాలు, వాటిని వ్యవస్థాబద్ధం చేసే రాజ్యం ఆ ఇరుకైన, ఎత్తైన గోడల మధ్య చిక్కగా అల్లుకొని ఉంటాయి. అందులోనే మనుషులుంటారు, మానవీయ స్పందనలు, భావోద్వేగాలు ఉంటాయని పితస్వామ్య వ్యవస్థా పీడితులైన స్త్రీల  కోణం
కొత్త పుస్తకం

ప్రశ్నించే చంద్ర పాట

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త కలాలను, గళాలను తెలుగు నేలకు పరిచయం చేసింది. కలాలు నడిపే సంవాదం కవితాత్మకం. గళాలు చేసే సంభాషణ కళాత్మకం. లలిత కళల్లో కవిత్వం ప్రథమ స్థానంలో ఉంటుంది. సహజంగానే కవిత్వం రాసే వారికి గుర్తింపు ఎక్కువ. మేధో సంబంధ కార్యకలాపంగా కవిత్వాన్ని పరిగణించడం సాహిత్యంలో మునుపటి నుంచి వస్తుంది. కవిత్వ పాఠకుల స్థాయి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కనుక కవితా కళకు పరిమితులు ఉన్నాయి. పద్యకవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం కొందరికే కమ్యునికేట్ అవుతుంది. ఏ మినహాయింపులు, షరతులు లేకుండా శ్రోతలందరికి ఏకశృతిలో చేరుకునేది పాట కవిత్వమొక్కటే. పాటలో సంగీత సాహిత్య
ఆర్ధికం

సవాళ్లను గుర్తించని ఆర్థిక వ్యవస్థ

మోడీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లక్షల కంపెనీలు మూతబడ్డాయి. ఉద్యోగాలు లేక యువత తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొరంటున్న ప్రధాన సవాలు పేదరికం. దాదాపు 28 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. దీనివల్ల  జనాభాలో ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థలో పాల్గొనలేకపోతున్నారు. ఇది పేదరికం యొక్క విష వలయానికి దారితీస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో పెద్ద
వ్యాసాలు

లొంగిపోయినా త‌ప్ప‌ని దాడులు,  దర్యాఫ్తులు  

Figure 1 ఉపర్పరలోని భీమా మాద్వి ఇంటి బయట రేఖపల్లి వాసులు డిసెంబర్ 4న, రేఖపల్లి గ్రామంలో భద్రతా బలగాలు తీసుకువెళ్తున్నప్పుడు భీమా మాడ్వీని అతని కుటుంబ సభ్యులు చివరిసారిగా చూశారు. మూడు రోజుల తర్వాత, వాట్టేవాగు దగ్గర ఉన్న  సెక్యూరిటీ క్యాంపులో ఒక మంచంపైన చనిపోయి ఉండటాన్ని అతని బంధువు సుక్రామ్ మాడ్వీ గమనించాడు. 46 ఏళ్ల భీమా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. అయితే, భద్రతా బలగాలు కొట్టి చంపి ఉంటాయని  అతని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, ఉసూర్ బ్లాక్‌లో ఉన్న రేఖపల్లి, వాట్టేవాగు గ్రామాల మధ్య  సుమారు మూడు కిలోమీటర్ల
వ్యాసాలు

నా జీవితానికి దారి దీపాలు – రాఘ‌వ‌

బాగా రాసే వారు కాదు, బాగా చదివేవారే బాగా లోతుగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలుగుతారు. బాగా చదివే వారే బాగా రాయగలుగుతారు. మంచి పుస్తకం మనిషి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. కొత్త చూపునిస్తుంది కొత్త ఆలోచనలను ఇస్తుంది ,ఆచరణ దిశగా చైతన్యవంతంగా నడిపిస్తుంది. మంచి పుస్తకం మాట్లాడుతుంది. మాట్లాడనిస్తుంది. అక్షరానికి గొంతు నిస్తుంది. * తెలుగు సమాజాలకు అవసరమైన ఎన్నో విలువైన వ్యాసాలను తెలుగులో నేరుగాను ,అనువాదం ద్వారానూ అందిస్తున్న రాఘవ కొత్త పుస్తకం 'ప్రశ్నించే గొంతులు'. ఈ పుస్తకం సోమవారం తిరుపతిలో ఆవిష్కరించబడుతుంది.  'మాట్లాడే పుస్తకాలు శీర్షికన'  పుస్తకాల గురించి తన అభిప్రాయాలను వసంతమేఘం కోసం అందించారు రాఘవ.
తొలికెరటాలు

అనేక రూపాల ప్రేమ‌

“ప్రేమమ్ – కాలయానం (1995)” అనే పుస్తకం పేరు వినగానే ఇది ఒక ప్రేమకథగా అనిపిస్తుంది. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత తెలుస్తుంది,ఇది కేవలం ప్రేమ గురించి మాత్రమే కాదు. ప్రేమను ప్రధానంగా పెట్టుకుని, కాలం, జ్ఞాపకం, విధి, పశ్చాత్తాపం, రెండో అవకాశం, తండ్రి ప్రేమ వంటి అంశాల్ని ఒకదానితో ఒకటి ముడిపెట్టి నడిపించిన కథ అని. 1995 అనే సంవత్సరం ఇక్కడ ఒక తేదీ కాదు; అది, మన మనసులో ఎప్పుడో దాచిపెట్టిన మధుర జ్ఞాపకాల్ని, పాత గాయాల్ని, చెప్పుకోని ప్రేమల్ని ఈ పుస్తకం మళ్లీ బయటకు తీసుకొస్తుంది. ఈ కథలో 1995 నేపథ్యం చాలా