కృత్రిమ మేధ – పాలకవర్గం
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో కృత్రిమ మేధ ప్రభావం పై అంతర్జాతీయ శిఖరాగ్ర సభ జరిగింది. ఈ సభలో 20 దేశాలకు చెందిన అగ్ర నేతలు, 60 దేశాలకు చెందిన మంత్రులు, వందమంది కంపెనీ సీఈఓ లు పాల్గొన్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, "ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ అభివృద్ది, నైపుణ్యాల పెంపుదల, ఉద్యోగ కల్పన, నైతికత, విధాన రూపకల్పనలు చేయడంగా ప్రకటించబడింది". కృత్రిమ మేధ అన్నది ఇప్పుడే పుట్టినది కాదు. 1950 లలోనే "డాక్ మౌత్" కంప్యూటర్ల తయారీ, వినియోగము, స్టోరేజీ, భాషల అనువాదం,హేతుబద్ద సమాధానాల రూపకల్పనలలో ఇంటర్నెట్ వాడకం నుంచే ఇది








