కూటమి ప్రభుత్వ యువరాజు నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగంలో చాలా మార్పులు జరుగుతాయని, ఉపాధ్యాయుల సర్వీస్ పరమైన సమస్యలుపరిష్కరింపబడతాయని, విద్యాభిమానులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అంతా ఆశించారు. కానీ గత 15 నెలల కాలంలో యువరాజు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అత్యంత ప్రతిష్టంభనకు గురి కావడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 117 విషయంలో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది.కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేయకుండానే,దాని సవరణల పేరుతో జీవో 20, 21 లను తీసుకొచ్చి ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను, తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థగా మార్చడంతో ప్రభుత్వ విద్య పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లైంది. ఫలితంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరగడమే కాకుండా, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం జరిగింది. కొత్తగా తెచ్చిన క్లస్టర్ వ్యవస్థ గత పాఠశాల సముదాయ వ్యవస్థ కన్నా ఏమంత మెరుగుగా లేదు కదా సమావేశాన్ని రాష్ట్ర స్థాయి అధికారులే వీడియోల రూపంలో నిర్వహించడం, ఉపాధ్యాయుల మధ్య చర్చలకు, విషయ సంబంధిత అంశాలపై చర్చలకు అవకాశం లేకపోవడంతో మొక్కుబడిగా సాగుతున్నాయి. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల మిగులు ఉపాధ్యాయ పోస్టులను క్లస్టర్ పాఠశాలలకు కేటాయించి, విద్యా శాఖ చేతులు దులుపు కొన్నది. 30 వేల పైచిలుకు డీఎస్సీ ఖాళీ లు 16 వేలకు కుదించబడినాయి. ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థకు రాష్ట్ర విద్యాశాఖ దాదాపు మంగళం పాడింది.
డబుల్ ఇంజన్ సర్కార్ ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యకు పరిష్కారం కనుగొని, డైట్ అధ్యాపకులు, జూనియర్ అధ్యాపకులు, మండల విద్యాశాఖ అధికారులు,డిప్యూటీ విద్యాశాఖ అధికారుల పోస్టులకు పదోన్నతులు వస్తాయని ఆశించిన ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది.మరోవైపు హైస్కూల్ ప్లస్ టు లలో పనిచేస్తున్న పిజిటి టీచర్ల సమస్యలు ఇంకా అపరిష్కృతం గానే ఉన్నాయి.ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతులలో ఎక్కువ శాతం పిజిటి పోస్టులు ఖాళీ అయిపోయాయి.అధ్యాపకులు లేకపోవడంతో సిలబస్ పూర్తి కాకుండానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు జరిగిపోతున్నాయి.గత ప్రభుత్వం కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులను రెగ్యులర్ స్కేలు లోనికి తీసుకొని వస్తుందని ఆశించినవారి సమస్య ను కూటమి ప్రభుత్వం లో కూడా ప్రతిష్టంభనకు గురి చేయడం జరిగింది. ప్రస్తుతం డైట్ లో పనిచేస్తున్న ఒకరిద్దరు రెగ్యులర్ అధ్యాపకులు కూడా పదవీ విరమణ పొందుతున్నందున, కొత్తగా పదోన్నతులు లేక ఆయా స్థానాలలో ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్లతో తాత్కాలికంగా సర్దుబాటు చేసి నెట్టుకొస్తున్నారు. గత సంవత్సర కాలంగా డిఇఓ ఖాళీ పోస్టులలో పదోన్నతులు లేక ఎఫ్ఏసీలతోనే కాలం గడుపుతున్నారు. 2025 జులై 31న కొందరు fac డిఈవోలు పదవీ విరమణ పొందగా,నేటికి ఒక నెల గడిచినప్పటికీ కనీసం ఆయా జిల్లాలకు ఎఫ్ఏసి డీఈవో లను నియమించకపోవడం ఆశ్చర్యకరం.నేటికీ శ్రీకాకుళంలో ఇన్ఛార్జి డిఇఓ తోనే మమ అనిపించి ఫైళ్లను పెండింగ్ లో ఉంచారు. ఇక 2019 నుంచి డీఈవో పూల్ లో గల భాషా పండితుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది.
2024 ఆగస్టులో జరిగిన పాఠశాల యాజమాన్య కమిటీ ల ఎన్నికలలో ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీలు ఉత్సవ విగ్రహాలుగా మారడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లు జాయింట్ గా ఉన్న నిధులు ఒక్క పైసా ఖర్చు చేయడానికి వీలు కల్పించకుండా చేశారు.మనబడి మన భవిష్యత్తు అంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం పాఠశాలల ఖాతాల్లో నిధులు ఉన్నప్పటికీ ఖర్చు చేయడానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకుండా మోకాలు అడ్డుతున్నారు. ఫలితంగా నాడు నేడు ఫేజ్ 2,ఫేజ్ 2ఎ కింద ఎంపికైన పాఠశాలల అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మాతృభాషా మాధ్యమాన్ని మృతప్రాయం చేయడంలోనూ, సిపిఎస్ సమస్యను సాగదీయడంలోనూ, కూటమి ప్రభుత్వం ఆరితేరిపోయింది. గత వైసిపి ప్రభుత్వం తెలుగు మీడియం రద్దు చేసిన సందర్భంలో తమ సొంత మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 ప్రకారం కనీసం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకైనా ఓ పి ఎస్ ను వర్తింప చేయడంలోనూ అదే సాచివేత ధోరణి కనపడుతుంది.
పై సమస్యలు ఏవి ఆర్థిక సమస్యలు కాకున్నా యువరాజు గారి పాలనంతా అధికారులపై వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖను ప్రతిష్ఠంభనకు గురి చేయడం జరిగింది. కొసమెరుపు ఏమంటే గత 15 నెలల కాలంలో గౌరవ యువరాజుగారు ఒక్కసారి కూడా రాష్ట్రంలో గల ఉపాధ్యాయ సంఘాలతో సమావేశంకాకపోవడము, ఆయాసంఘాల అభిప్రాయాలుతెలుసుకోకపోవడం మరింత విడ్డూరంగా ఉంది. ఇదే మన యువరాజుగారి పాలనలో రాష్ట్ర విద్యాశాఖ దుస్థితి.
MINISTER LOKESH —BIG JOKE
FUTURE CHIEF MINISTER —INDIA EVERYTHING IS POSSIABLE
============BUCHIREDDY GANGULA