తగ్గిన ఉపాధి – పెరిగిన నిరుద్యోగం
భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతూ ఉందని, ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏర్పడనుందని, తద్వారా ఉపాధి పెరిగి నిరుద్యోగం, పేదరికం తగ్గుతుందన్న మోడీ ప్రభుత్వ ప్రచారం ఎంత బూటకమో దేశంలో పెరిగిన నిరుద్యోగం, తగ్గిన ఉపాధిని గమనిస్తే తెలుస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ఆదాయ అసమానత ఉపాధి దృష్టాంతం భయంకరంగా ఉందని తన నివేదికను 27 మార్చి 2024న విడుదల చేసింది. 2000-2024 వరకు నిర్వహించిన సర్వేల ద్వారా భారత ప్రభుత్వ, రిజర్వు బ్యాంకు లెక్కలను, జాతీయ నమూనా సర్వేను, పీరియాడికల్









