ఆర్థికం

పోషకాహార లోపం… పాలకుల వైఫల్యం!

నేటి బాలలే రేపటి పౌరులు. బాలల ఆహారం, ఆరోగ్యం, విద్య, మానసిక వికాసానికి తగిన చర్యలు తీసుకోకపోతే ఆ దేశం అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. ప్రస్తుతం మన దేశంలోని బాలలు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. దేశం 2021లో ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న 7 లక్షల మంది బాలలు చనిపోయారు. వీరిలో 5 లక్షల మంది (70 శాతంకు పైగా) పోషకాహార లోపంతో చనిపోయారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తల్లి ఎదుర్కొంటున్న పోషకాహార లోపం పిల్లల మరణాలకు కూడా కారణమౌతున్నది. ఇదేకాలంలో ప్రపంచ వ్యాపితంగా 47 లక్షల మంది పిల్లలు మరణించారు. వీరిలో 24 లక్షల
ఆర్థికం

ఆందోళనకరంగా ఆర్థిక వ్యవస్థ

ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌(ఎఫ్‌ఇ) నివేదిక ప్రకారం దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోంది. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం, రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి క్షీణత, విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి, స్టాక్‌ మార్కెట్ల నష్టాల్లోకి జారుకుంటున్నాయి. గ్యాస్‌, డిజిల్‌, పెట్రోల్‌ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది, ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. భారత జనాభాలో యువత 50 శాతం వరకు ఉంది. వారి నైపుణ్యానికి తగిన ఉపాధి లేకపోవడంతో ఉత్పాదక శక్తి పుంజుకోవడం లేదని, పర్యవసానంగా  పారిశ్రామిక వృద్ధి కుంటుపడుతుందని, ఇందుకు పాలకుల అనుచిత విధానాలే కారణమని ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పష్టం చేసింది. గత సంవత్సర
ఆర్థికం

అదానీకి చట్టాలు వర్తించవా ?

గత రెండు దశాబ్ధాలుగా, బొగ్గు  సంబంధిత అవినీతి కథనాలను భారతదేశం చూసింది. 2014లో యుపిఎ-2 ప్రభుత్వం పతనం కావడానికి, బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం బొగ్గు గనుల కుంభకోణం. ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో మరో బొగ్గు కుంభకోణం బయట పడింది . మోడీకి అత్యంత నమ్మకస్తుడైన గౌతమ్‌ అదానీ దిగుమతి చేసుకున్న విదేశీ బొగ్గు ధరను అత్యంత ఎక్కువగా చూపించి వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన కథనాన్ని లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక దినపత్రిక పైనాన్షియల్‌ టైమ్స్‌ ‘ద మిస్టరీ ఆఫ్‌ అదానీ బొగ్గు దిగుమతుల విలువ నిశబ్దంగా రెట్టింపు అవుతోంది’ అనే శీర్షికతో
ఆర్థికం

మాంద్యంలోకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

1980 దశకంలో నెమ్మదించిన వృద్ధి, వాణిజ్య అసమతుల్యత, క్షీణిస్తున్న సామాజిక పరిస్థితుల్లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ శకం ప్రారంభమైంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన 1990 నుండి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో ఆటు పోట్లు ఏర్పడుతోన్నాయి. పర్యావరణ సమస్యలు, యుద్ధాలు. ఫలితంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలోకి జారుకున్నాయి. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, పేదరికం పెరిగింది. ప్రపంచ ద్రవ్య సంస్థలు, కార్పొరేట్లు, ఆయా దేశాలలోని ఆశ్రితులు విపరీత లాభాలు గడిరచి బిలియనీర్లుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, దేశాలలోని ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగాయి. మరోవైపు దేశాల రుణభారం పెరిగింది. సహజ వనరుల లూటీ
ఆర్థికం

తగ్గిన ఉపాధి – పెరిగిన నిరుద్యోగం

భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతూ ఉందని, ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏర్పడనుందని, తద్వారా ఉపాధి పెరిగి నిరుద్యోగం, పేదరికం తగ్గుతుందన్న మోడీ ప్రభుత్వ ప్రచారం ఎంత బూటకమో దేశంలో పెరిగిన నిరుద్యోగం, తగ్గిన ఉపాధిని గమనిస్తే తెలుస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ఆదాయ అసమానత ఉపాధి దృష్టాంతం భయంకరంగా ఉందని తన నివేదికను 27 మార్చి 2024న విడుదల చేసింది. 2000-2024 వరకు నిర్వహించిన సర్వేల ద్వారా భారత ప్రభుత్వ, రిజర్వు బ్యాంకు లెక్కలను, జాతీయ నమూనా సర్వేను, పీరియాడికల్‌