వాళ్లు ఈచోట
చివరి శ్వాసను విడిచారు
ఎన్నడూచూడబోని భవిష్యత్తు కోసం
భారీ మూల్యమే చెల్లించారు
చేతులకు సంకెళ్లతో
ఆగ్ని గుండాల గుండా నడిచారు వాళ్ళు
కానీ మాతృభూమి కోసం
నిరంతర తపన ఉండేది
తుపాకులు కెదురీదారు
జైళ్లను ఆహ్వానించారు
కానీ ఏనాడు వెనుదీరిగింది లేదు
తమ పిల్లల భవిష్యత్తు కోసం
త్యాగాలకు వెరిసింది లేదు
వాళ్ళ చివరి శ్వాసలకు కాసిన
స్వాతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం
వాళ్ళు కలలు కన్న జీవితాన్ని
మనం జీవిస్తున్నాం
తమ రక్తంతో
తమ పోరాటంతో
తమ బాధలతో
తమనష్టాలతో
వాళ్లొక జ్వాలను వెలిగించారు
ఈ సంకెలా వాళ్లను ఆపలేదు




