దండకారణ్యంలో మావోయిస్టులపై కార్పొరేట్ యుద్ధం
బిజెపి ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోడానికి కావలసిన బలమైన పునాదిని ఆరెస్సెస్ అందిస్తోంది. మాతృసంస్థగా ఆరెస్సెస్, దాని రాజకీయ వేదికగా బిజెపి రెండిరటికీ మధ్య సమన్వయం, ఉమ్మడి పని విధానం గత దశాబ్ధ కాలంలో బాగా బలపడ్డాయి. ఫాసిస్టు స్వభావం గల బిజెపి రాజకీయ పార్టీగా ఆధిపత్యం సాధించింది. 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో మనువాద ఫాసిస్టు స్వభావం గల మితవాద, మతోన్మాద, నిరంకుశ శక్తులు బలపడ్డాయి. హిందూత్వ బడా బూర్జువా-భూస్వామ్య వర్గాలకు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతినిధిగా ఉంది. ఆ వర్గాల మద్ధతును తన వెనుక బలంగా సమీకరించుకుంది. హిందూత్వ సిద్ధాంత ప్రభావాన్ని విస్తరించి, బడా










