వికసిత భారత్ @ 2047 – కార్పొరేట్ హిందూ రాష్ట్ర
విరసం ఆవిర్భావ దినం సందర్భంగా సదస్సు జూలై 4 2024, గురువారం ఉ. 10 గంటల నుండి సా . 6 గంటల వరకుసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్ వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క పోలింగ్‌తో కూలిపోదని రుజువైంది. అయినా హిందుత్వ ఫాసిస్టు దురహంకారానికి ఎన్నికల్లో కూడా ప్రజలు కళ్లెం వేశారు. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, ప్రలోభాలతో సాగిన ఎన్నికల ప్రచారంలో సహితం ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు. ఫాసిస్టు నరేంద్ర మోదీ కళ్లలో భయం బట్టబయలైంది. రాముడు కాపాడలేడని కూడా తేలిపోయింది. ‘మందబుద్ధి’ని రెచ్చగొట్టి ఎల్లకాలం చెలామణి కాలేరని స్పష్టమైంది. ప్రజల వివేకం, సత్యాసత్యాల ఎరుక ఎంత