డాలర్ ఆధిపత్యానికి తెరపడనుందా ?
ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు 'బలం' అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి యున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. అప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించిన బ్రిటన్, తదితర పశ్చిమ యూరప్ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో పాటు ఐరోపాలోని ఇతర పశ్చిమ దేశాల కరెన్సీల విలువ కూడా క్షిణించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచింది అమెరికా ఒక్కటే. ఆ దేశం దగ్గర










