ఓ బాలిక డైరీ
మూలం: ఆన్ ఫ్రాంక్ తెలుగు అనువాదం: బీనా దేవి ప్రపంచంలోనే మహా నియంత. ఎటువంటి నేరమూ చేయని లక్షలాది యూదు జాతీయులను కేవలం ‘యూదులుగా పుట్టడమే వాళ్ళ నేరమని’ భావించి, మారణహోమం చేయించిన నర రూప రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అతను పరిపాలిస్తున్న కాలంలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఒక ఇంట్లో అటక లాంటి భాగంలో తన కుటుంబంతో సహా గడిపిన ఒక యూదు బాలిక ఆన్ ఫ్రాంక్. జర్మన్ లో ఫ్రాంక్ ఫర్డ్ నగరంలో 1929 జూన్ 12 వ తేదీన పుట్టింది ఆన్ ఫ్రాంక్. తండ్రి ఒట్టో ఫ్రాంక్. తల్లి










