ఆమె వొక ఆయుధం.. తన కవిత్వమొక యుద్దమైదానం..
మానవజీవితంలో కవిత్వం ఒక నిరంతరం అన్వేషణ. సమాకాలీన ప్రపంచంలో నిజం ఎక్కడున్నా వెలుగులోకి తెచ్చే ప్రతిస్పందనా సాధనం. ఏ భాషలోనైనా`ఏ ప్రాంతంలోనైనా అది కొనసాగే సంవాదం. ఆకలి` ఆవేదనలను నిర్మోహమాటంగా గుండెల్లోకి పంపించే అక్షర సముదాయం -అద్దేపల్లి రామ్మోహన్ రావు. కవిత్వమే ఆయుధంగా సమాజాన్ని నడిపించాలని అహర్నిశలు కలలు కన్న వాళ్ళలో చాలా మంది ఉంటారు. కొంతమంది బయట ప్రపంచానికి తెలిసి ఉండటమో..తెలియకపోవడమో యాదృచ్చికం. కాని వాళ్లు సృజియించిన అక్షరాలు మాత్రం ఎన్నితరాలు మారినా అవి శాశ్వతంగా ఈ యుద్దమైదానంపై పోరాడుతూనే ఉంటాయి. అటువంటి పోరాట పటిమ ఉన్న నిండా సామాజిక చైతన్యం కలిగిన కవయిత్రి కొత్త










