సమకాలీనం

శాంతి చర్చల పూర్వాపరాలు

 (రంగులు మారుతున్న నక్సలిజం – సదస్సుకు స్పందన)      నక్సల్బరీ కాలం నుంచీ కమ్యూనిస్టులు కానివారు, అశేష ప్రజాదరణ ఉన్నవారు విప్లవకారులను పీడిత ప్రజలలో పని చేస్తున్నట్లు గుర్తించి సంభాషణ జరుపుతున్నారు . అప్పటి  నుంచీ  దానికి  గుండెలు బాదుకుంటున్నవారు  కూడా ఉన్నారు. వీళ్లు భావజాల రీత్యా బ్రాహ్మణీయ, మార్కెట్ శక్తుల ప్రతినిధులు.  శంకరన్, పొత్తూరి విప్లవకారులతో సంభాషణ జరిపి, ప్రభుత్వంతో చర్చల దాకా తీసుకువచ్చి చర్చల వైఫల్యానికి, తర్వాత హింసా విధ్వంసాలకు ప్రభుత్వమే కారణమనడం ఇప్పటికీ వీళ్లకు మింగుడు పడడం లేదు. పుబ్బలో పుట్టి మఖలో మాయమయే ఇటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. హరగోపాల్ పోరాట రూపాలు ప్రజలు
సమకాలీనం

అటవీ హక్కుల చట్టంపై పొంచి ఉన్న ముప్పు; రాజ్యాంగబద్ధతపై విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

షెడ్యూల్డ్ తెగలు (అనుసూచిత తెగలు- ఆదివాసులు) ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2006, (దీనిని సాధారణంగా అటవీ హక్కుల చట్టం అని పిలుస్తారు) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల ఆధారంగా సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 2న కేసున విచారణ చేపట్టనుంది. షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులను అటవీ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో తరలించడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, చట్టపరమైన అడ్డంకులు, పర్యావరణ విధ్వంసం పెరుగుతున్న ముప్పులు, ఇవి చాలా ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. మరోవైపు, అటవీ హక్కుల చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పైన ప్రశ్నలు లేవనెత్తుతూ,
సమకాలీనం

ఆదివాసులను హింసించిమావోయిస్థులపై విజయం సాధించగలరా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 15నాడు  రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును ప్రదానం చేశాడు. శాంతిభద్రతల పరిరక్షణలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, రాష్ట్రంలో శాంతిని కాపాడటంలో వారు చేస్తున్న ఆదర్శవంతమైన పనిని ప్రశంసించాడు. (యుద్ధ సమయంలోనూ, శాంతి సమయంలోనూ అసామాన్య సేవలు చేసినందుకు వాయు, నౌకా సేవా బలగాలకు ఇచ్చే పతకాలు అవి) ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం నుండి నక్సలిజాన్ని నిర్మూలించడానికి 2026 మార్చి 31ని గడువుగా పెట్టాడు. ఆ ప్రయత్నంలో సాధించిన పురోగతిని ఎత్తిపడుతూ, భద్రతా బలగాలు
కాలమ్స్ సమకాలీనం

వరికపూడి సెల (దమ్మర్ల గొంది) ప్రాజెక్టును  నిర్మించాలి

పల్నాడు జిల్లాలో ఒకవైపు కృష్ణానది పరవళ్ళు  తొక్కుతున్న  దాని అతి సమీపంలో ప్రజలు త్రాగునీరు సాగునీరు లేక  వలసలు పోతున్నరు, పశువులకు నీళ్లు దొరకని ప్రాంతం కూడా ఎగువ పల్నాడు లోని వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలం, ప్రకాశం జిల్లా పుల్లల  చెరువు, ఎర్రగొండపాలెం  ప్రాంతాలు, 1944 ప్రాంతంలో నందికొండ  ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది, 1954లో నందికొండ ప్రాజెక్టు (నాగార్జునసాగర్ ) నిర్మాణం సందర్భంగా  కోస్ల  కమిటీ వెల్దుర్తి, దుర్గి,మాచర్ల, బొల్లాపల్లి, పుల్లలచెరువు తదితర మండలాలు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుండడంతో దీనికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేయాలని సూచించారు.
సమకాలీనం

మావోయిస్టులపై యుద్ధం నేపథ్యంలో చంద్రార్కర్ హత్య

2025 మొదటి వారంలో బస్తర్‌లో 16 మంది మరణించారు. వారిలో ఒకరు యువకుడు, ధైర్యవంతుడైన జర్నలిస్టు, ముఖేష్ చంద్రార్కర్. బీజాపుర్ జిల్లాలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆయన  బయటకు తీసిన వార్తలు  ప్రభుత్వ దర్యాప్తుకు దారితీసిన ఐదు నెలల తర్వాత, ఆయన మృతదేహం రోడ్డు కాంట్రాక్టర్ కు చెందిన స్థలంలోని  సెప్టిక్ ట్యాంక్‌లో  దొరికింది. అవినీతిని బహిర్గతం చేసినందుకు జరిగిన చంద్రార్కర్ హత్య, సహజంగానే దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. అయితే ఈ ప్రాంతం మావోయిస్టుల  పోరాటంతో ఎంత సన్నిహితంగా ముడిపడి ఉందో కొద్ది మందికే తెలుసు. చంద్రాకర్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, 120
సమకాలీనం

ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థల బహిష్కరణ

"వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారణ చేయకుండా మేము మా మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి పని చేయలేం." పెర్సివల్ ఎవెరెట్, సాలీ రూనీ, వియట్ థాన్ న్గుయెన్, కవే అక్బర్, మిచెల్ అలెగ్జాండర్, అన్నీ ఎర్నాక్స్, నవోమి క్లైన్, టీ ఒబ్రెహ్ట్, పీటర్ కారీ, జెరిఖో బ్రౌన్, నటాలీ డియాజ్, మేరీ గైట్స్కిల్, హరి కుంజ్రు, రాచెల్ పా కుష్రు, జస్ట్ టి. లీలానీ, సుసాన్ అబుల్హావా, వలేరియా లూయిసెల్లి, జియా టోలెంటినో, బెన్ లెర్నర్, జోనాథన్ లెథెమ్, హిషామ్ మాటర్, మాజా మెంగిస్టే, చైనా మివిల్లే, టోర్రీ పీటర్స్, మాక్స్ పోర్టర్, మిరియమ్ టోవ్స్,
సమకాలీనం

పర్యావరణం కోసం ప్రాణాలు కోల్పోయిన  కార్యకర్తలు 

‘గ్లోబల్ విట్‌నెస్’ రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2012 నుండి పర్యావరణ పరిరక్షణా కర్తవ్యంలో  మొత్తం 2,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లోనే, కనీసం 196 మంది పర్యావరణ రక్షణ కార్యకర్తలు తమ ఇళ్లను లేదా సముదాయాలను రక్షించుకోవడానికి పోరాడుతూ మరణించారు. వీటిలో భారత్ పదో స్థానంలో ఉంది. పర్యావరణం, భూమి హక్కుల కోసం మాట్లాడే వారిపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఈ ఆందోళనకరమైన సంఖ్య ప్రపంచ సంక్షోభాన్ని నొక్కి చెబుతుంది. కొలంబియా వరుసగా రెండో ఏడాది కార్యకర్తలకు అత్యంత ఘోరమైన దేశంగా వుంది. 2023లో, గ్లోబల్ విట్‌నెస్ రికార్డ్ చేసిన ఒక్క సంవత్సరంలో మరే ఇతర దేశం కంటే
సమకాలీనం

చేయని నేరానికి ..

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో విషాదకర స్థితి ఏర్పడింది . ఇక్కడి ఆదివాసీలు తమ హక్కులు, గౌరవం, మనుగడ కోసం ప్రతిరోజూ పోరాడుతున్నారు. ఈ ప్రాంతంలో బెదిరింపులు, పేదరికం, పోలీసు క్రూరత్వాలు వారి జీవితాలను అనిశ్చితిలోకి నెట్టాయి; ఇక్కడ ప్రతి రోజు వారికి ఒక కొత్త సవాలును తెస్తుంది. వారు తమ స్వరాన్ని పెంచే ప్రయత్నాలకు పోలీసుల నుండి నిరాశ, ఉదాసీనత మాత్రమే ఎదురౌతాయి. సోన్‌భద్ర ఆదివాసుల పట్ల పోలీసుల ప్రవర్తన వారి వాస్తవికతను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భూమిపై శాశ్వత యాజమాన్యం లేదా ఆర్థిక శక్తి లేని పేద ఆదివాసీలు శక్తివంతమైన పోలీసుల నుండి అణచివేతను ఎదుర్కొంటున్నారు.
సమకాలీనం

వాళ్లిద్దరి విడుదల గురించీ నినదించలేమా?

చిలకలూరిపేట బస్సు దహనం కేసు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 1993 మార్చి 8న జరిగిన ఆ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో సాతులూరి చలపతిరావు, గంటెల విజయవర్ధనరావులు అరెస్ట్ అయ్యారు. వారిద్దరూ గుంటూరు కోబాల్డ్ పేట కు చెందిన దళిత యువకులు. కేవలం ఆర్ధిక అవసరాల కోసం ఇతరత్రా డబ్బులు దొరకని అప్పు పుట్టని పరిస్థితుల్లో వారు దోపిడీ చేయాలనుకున్నారు. అలాంటి ఆలోచనలకు ఆ ఇద్దరూ నెట్టివేయబడడానికి కారణం ఖచ్చితంగా సమాజమే. ఈ విషయం కన్వీనియంట్ గా మర్చిపోతాంగానీ ... ఇదే అసలు సమస్యగా గుర్తించాల్సి ఉంటుంది. బస్సు దహనం జరిగిన సందర్భంగా 23
సమకాలీనం

అవార్డును తిరస్కరించిన రచయిత్రి జసింతా కెర్కెట్

పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ బాధితులకు సంఘీభావంగా యునైటెడ్  ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూ‌ఎస్‌ఎఐ‌డి), రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ సంయుక్తంగా ఇచ్చిన అవార్డును స్వీకరించడానికి ఆదివాసీ కార్యకర్త, రచయిత్రి జసింతా కెర్కట్ట నిరాకరించారు. ఆమె పుస్తకం, కవితల సంపుటి అయిన జిర్హుల్, చిల్డ్రన్స్ బుక్ క్రియేటర్స్ అవార్డులలో 'రూమ్ టు రీడ్ యంగ్ ఆథర్ అవార్డు'కి ఎంపికైంది. ఈ నిర్ణయంపై అవార్డు యిచ్చేవారు ఇంకా బహిరంగంగా స్పందించలేదు. బాలల సాహిత్య అవార్డుల 2వ ఎడిషన్ వేడుక అక్టోబర్ 7న జరుగుతుందని దాని వెబ్‌సైట్ పేర్కొంది. పిల్లల కోసం పుస్తకాలు ముఖ్యమైనవి కానీ పెద్దలు