ఉచ్చ నీతికి చెంప పెట్టు ‘ఉచ్చల జలధి తరంగ’
“కవితలు చెప్పుకునే వేళ కాదిది, కాళ్లు కడుక్కునే వేళ కూడా కాదు, ఇది ఒక శిశ్నచ్చేద సమయం “ నిజమే ఇది ఒక విపత్కర కాలం మొన్నటి వరకు వాడి గురి అంతా అడవుల మీదే అనుకున్నాం. అడవుల్ని నాశనం చేసీ అక్కడి సహజ వనరుల్ని మొత్తంగా పెట్టుబడి వర్గాలకు అందించడమే వాళ్ళ లక్ష్యమన్న భ్రమల్లో ఉన్నాము. మనిషీ తత్త్వాన్ని వేర్లతో సహా పెకిలించాలనే ఉద్ధేశంతో ఇక్కడి మనుష్యుల్ని కులాలుగా,మతాలుగా, జాతిగా, ప్రాంతంగా ఎన్ని రకాలుగా విడగొట్టుకుంటూపోవాలో అన్ని రకాలుగా విభజిస్తూ వస్తున్నారు. అలా విభజించడానికి విద్వేషాన్ని పంచుకుంటూ వెళ్తున్నారు.వెళ్ళే దారిలో కనిపించేవన్ని వాళ్ళు పంచే విద్వేషానికి మాధ్యమాలుగా










