స్త్రీ ఆత్మగౌరవ పోరాటం “అలల కాలం”
ఒకప్పుడు స్త్రీ భుజాల పై వస్త్రం ఉండకూడదని చట్టాలు చేసిన సమాజం, నేడు ఆమె ఏ బట్టలు వేసుకోవాలో చెప్పుతుంది, మారింది కాలం మాత్రమే అణిచివేత కాదు. చరిత్రను మనం ఎక్కువగా రాజులు, యుద్ధాలు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్న విషయాలకే పుస్తకాల్లో స్థానం ఉంటుంది. కానీ ఒక స్త్రీ తన శరీరాన్ని తన ఇష్టానుసారం కప్పుకోవడానికి కూడా పోరాడాల్సి వచ్చిన చరిత్ర గురించి ఎంతమందికి తెలుసు? ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భుజాల పై బట్టలను వేసుకోవాలంటే రక్తం చిందించాల్సి వచ్చిందనే విషయం ఎంతమంది చదివారు? అలాంటి చరిత్రను చూపించిన నవల అలల కాలం.










