అమ్మాయిలపై పబ్లిక్, డిజిటల్ వేధింపులు
ఈ ప్రపంచంలో అమ్మాయిగా జీవించడం అంటే భయంతో, జాగ్రత్తలతో, అనేక అడ్డంకులతో నడవడం అని చెప్పిన అతిశయోక్తి కాదు. అమ్మాయి ఎంత బలంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా ఆమె బయటికి వెళ్లే ప్రతిసారి, ఫోన్ పట్టుకునే ప్రతిసారి, రోడ్డు మీద నడిచే ప్రతిసారి ఒక చిన్న భయం ఆమె మనసులో ఉండక తప్పదు. ఎందుకంటే పబ్లిక్ ప్రదేశాల్లో జరుగుతున్న వేధింపులు ఏళ్ళుగా ఉన్న, ఇప్పుడు అది కాదు ఫోన్లలో, సోషల్ మీడియాలో కూడా వేధింపుల రూపం పెరిగిపోయింది. అమ్మాయిలకు రెండు వైపులా ప్రమాదాలు పెరుగుతున్నాయి పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిలపై వేధింపులు చాలా కాలంగా ఉన్నాయి.










