చీకట్లో మిణుగురులు
(డిసెంబర్లో విరసం ప్రచురించిన మిడ్కో కథల సంపుటి *మెట్లమీద *కు రాసిన ముందుమాట ఇది . అమర యోధ రేణుక స్మృతిలో పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) మిడ్కో అంటే గోండు భాషలో మిణుగురు పురుగుఅట. అంటే చీకట్లో మెరిసే ఒక ప్రాణి. ఒక నక్షత్రం. ఒక ప్రాణి తాను చీకటిలో మెరిసి వెలుగుచూపే ఒక ప్రక•తి నిర్మాణం విచిత్రమైనది. అద్భుతమైనది. గాలిలో అడవిలో ముఖ్యంగా చీకట్లో చూసినపుడు కాని దీని విశిష్టత అర్థంకాదు. అట్లే ఒక ఆరిద్ర పురుగుంది. మ•గశిర కార్తె రాగానే పొలాల్లో బిలబిల వచ్చే కుంకుమపువ్వు వంటి ఒక పురుగు. నిజానికి










