వ్యాసాలు

వీరమాత కామ్రేడ్‌ అనసూయమ్మకు నివాళి!

అనసూయమ్మ 2022, జనవరి 30న తన 97వ యేట హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆమె మావోయిస్టు నాయ‌కుడు   అమరుడు కామ్రేడ్‌ సంతోష్‌ (మహేష్‌)కు కన్నతల్లి. దండ‌కార‌ణ్య సాహిత్య సాంస్కృతికోద్య‌మ ప‌త్రిక 'రుంకార్ అమెకు తలవంచి వినమ్ర శ్రద్దాంజలి అర్చిస్తున్నది. ఆమె బంధు మిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. అనసూయమ్మ దాదాపు 80 యేళ్ల క్రితం ఎర్రంరెడ్డి లక్ష్మారెడ్డి స‌హ‌చ‌రిగా వర్తమాన జనగామ జిల్లా కడవెండిలో అడుగుపెట్టింది. విసునూరు దొరలతో వీరంగమాడి, కరడుగట్టిన భూస్వామ్యానికి బీటలుబార్చిన తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య అమరత్వం రూపంలో తొలిత్యాగాన్ని అందించిన గ్రామంగా కడవెండి తెలంగాణ చరిత్రలో చెరిగిపోని ముద్రవేసుకుంది. పుట్టిన వర్గం, ముఖ్యంగా
వ్యాసాలు

తిజిమాలి మా ఆత్మ

“మేము తిజ్‌రాజా పిల్లలం, మా తిజిమాలిని తవ్వడానికి ఎలా అనుమతిస్తాం? తిజిమాలి మా ఆత్మ, ఆత్మ లేకుండా ఎలా జీవించగలం? వాగులను మాత్రమే కాదు మా గుర్తింపును కూడా నాశనం చేసే గనుల తవ్వకానికి ఎలా అనుమతినిస్తాం? మేము మా మాలి కొండ కోసం, మా అడవుల కోసం, అన్ని విధాలుగా పోరాడుతామే కానీ మా ఆత్మను వేదాంత కంపెనీ తవ్వడాన్ని ఒప్పుకోం.” అక్టోబర్ 16న ఒడిశాలోని రాయగడ, సుంగర్ పంచాయతీ, కాశీపూర్ బ్లాక్‌లో జరిగే బహిరంగ విచారణకు ముందు రోజు రాత్రి తిజిమాలి పర్వత ప్రాంతంలోని బంతేజీ గ్రామానికి చెందిన మహిళలు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని ఏకగ్రీవంగా
ఓపన్ పేజ్

భారత ప్రజాయుద్ధానికిఎల్లెలెరుగని సంఫీుభావం

ప్రపంచంలో ఎక్కడున్నా ప్రజల ఆకాంక్షలు కలుస్తాయి. మానవాళి  స్పందనలు ఉమ్మడి రూపం ధరిస్తాయి. ఒకే హృదయంలోంచి వ్యక్తమవుతాయి. చరిత్ర నిర్దేశించే లక్ష్యాలను విశాలమైన చూపులతో మారుమూలల నుంచి కూడా పోగు చేసుకుంటాయి.  విశ్వాసాలు, విలువలు, ప్రయోజనాలు భౌతిక రూపం ధరిస్తాయి. న్యాయాన్యాయ వైఖరులు ఎల్లప్పుడూ మానవీయత వైపే  నిలబడతాయి. లేకపోతే పాలస్తీనా అస్తిత్వం కోసం ప్రపంచమంతా  ఒకే గొంతుగా ఎట్లా ప్రతిధ్వనిస్తుంది? రక్తసిక్త  బస్తర్‌ అంతర్జాతీయ చైతన్యంగా ఎట్లా ప్రతిఫలిస్తుంది? దేశాల, సమూహాల ఉనికిని దురాక్రమిస్తున్న మార్కెట్‌కు, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ఎందుకు వెల్లువెత్తుతుంది? బాధితులకు ఈ ప్రపంచమంతా సంఫీుభావం ఎందుకు అందిస్తుంది? పాలస్తీనాలాగే బస్తర్‌ కూడా ఇవాళ
వ్యాసాలు

పాలస్తీనా గర్జన ప్రతిధ్వనించాలి

అక్టోబర్ 7వ తేదీన ఆక్రమిత పాలస్తీనాలోని గాజాలో ఒక ప్రతిఘటనా వెల్లువ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఫాసిజాన్ని  ఆసరా చేసుకుని ప్రజలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదం ముందుకు వస్తున్న సమయంలో, దానిక వ్యతిరేకంగా పోరాడాలన్న ఆలోచన వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో దాన్ని గత ఏడాది సామ్రాజ్యవాద అంతర్గత సంఘర్షణ తీవ్రతరం చేసింది. ఈ మధ్యలో సామ్రాజ్యవాదుల మధ్య సంక్షోభం సాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ లో జియోనిస్టుల ఆక్రమణకు వ్యతిరేకంగా వారి అస్తిత్వానికి వీర పాలస్తీనా ప్రజలు అగ్గిరాజేశారు. హమాస్ (ఇస్లామిక్ ప్రతిఘటనా ఉద్యమం ), పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, డెమోక్రటిక్
వ్యాసాలు

ఇరవై ఐదేళ్ల విప్లవాచరణ

( నవంబర్ 24 న కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేవారి పాలెంలో జరిగిన కామ్రేడ్  గౌతమ్ సంస్మరణ సభలో  ఆవిష్కరించిన *సమాజ శిల్పి* పుస్తకానికి రాసిన ముందు మాట) కామ్రేడ్ గౌతమ్ ను 2006 నవంబర్ 23న పోలీసులు దొంగ ఎదురు కాల్పుల్లో హత్యచేశారు. 24న తెల్లారికల్లా పత్రికల్లో ఈ విషాద వార్త వచ్చింది. మేము కొద్దిమందిమి రాత్రికి బయల్దేరాలి అనుకున్నాము. అప్పటికే గౌతం కుటుంబ సభ్యులు విజయవాడలో పౌరహక్కుల సంఘం నాయకులను కలిశారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకోడానికి గౌతమ్ కుటుంబ సభ్యులతోపాటు మీరెవరైనా వెళతారా? అని లాయర్ ఆంజనేయులుగారు అడిగారు. మేము రావడానికి లేటు
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమ‌ర్శ‌కుడు పోతులూరి వీర‌బ్ర‌హ్మం

పోతులూరి వీరబ్రహ్మం పేరెత్తగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన చెప్పిన కాలజ్ఞానం. ఏదైనా వింతలు, అద్భుతాలు జరిగితే ఇలా జరుగుతుందని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారని అనుకోవడం పరిపాటి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడమే కాదు, కవితా విమర్శ కూడా చేశారు. ఏది కవిత్వం? కవి ఎలా వుండాలి? కవితా లక్ష్యమేది అన్న విషయాల్ని కూడా చర్చించారు. ఆయన ఈ చర్చ చేయడానికి కారణాలనేకం. ముఖ్యంగా ఈయన ప్రబంధకాలం తరువాతవాడు. ప్రబంధకాలం నాటి కాలక్షేప రచనలు, మితిమీరిన శృంగార ప్రకృతి వర్ణనల్ని బ్రహ్మంగారు వ్యతిరేకించారు. అందుకై ఆయన సంఘ సంస్కరణాభిలాషతో కలం పట్టారు. వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేది కాలజ్ఞానం కాగా మిగతా
వ్యాసాలు

సోషలిస్టు సమాజ విజయాలు: విద్య – ఉపాధి

నేడు మన నిరుద్యోగ యువత ప్రభుత్వం ఉపాధి కల్పించమని రోడ్లపైకి వస్తే పోలీసుల లాఠీదెబ్బలు తిని చేసి జైలుకు వెళ్లాల్సి వస్తున్నది . కానీ కేవలం ఏడు దశాబ్దాల క్రితం, పూర్తిగా యిందుకు భిన్నంగా పాలన ఉన్న దేశాలు ఉన్నాయి. అంటే, మీరు పని లేదా ఉద్యోగం చేయకూడదనుకుంటే, మిమ్మల్ని అరెస్టు చేసి 'లేబర్ క్యాంపు'లో శ్రమ చేయడానికి పంపిస్తారు. మీరు పరాన్నజీవి వర్గానికి  చెందినవాళ్ళు కాబట్టి  మీరు పని చేయకూడదని అనుకుంటున్నారని భావిస్తారు. ఈ దేశాల్లో, 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలందరికీ ఉపాధి హామీ వుండింది. ఈ దేశాలను సోషలిస్టు దేశాలు అని పిలిచేవారు, ఆ
వ్యాసాలు

దియే జల్తే హై!

రాజేంద్రబాబు అర్విణి అది అక్టోబర్‌ 6 2021. రాంమోహన్‌ కు రోజూ 6, 7 కిలోమీటర్లకు తక్కువకాకుండా మార్నింగ్‌ వాక్‌ చేసే అలవాటు. వనస్థలిపురం లో పార్కులు, రోడ్లు అన్నీ కలగలిపి తిరిగేవాడు. ఆ రోజు కూడా మార్నింగ్‌ వాక్‌ లో భాగంగా దాదాపు 6 కిలోమీటర్ల నడక పూర్తి చేసాడు. ఎప్పటి లాగా దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. అనారోగ్య లక్షణాలు చూచాయగా కూడా ఏమీ లేవు. ఆ రోజు... ఆ క్షణాలు... ఆ కాలం అలాగే ఘనీభవించి పోయి ఉంటే ఎంత బాగుండేది! ఆ తర్వాత మూడవ రోజు... అది అక్టోబర్‌ 9 - ఆ
వ్యాసాలు

మ‌న‌  కాలపు మావోయిస్టు జీవన సందేశం

ప‌ద్మ‌కుమారి (అమ‌రుల బంధు మిత్రుల సంఘం త‌ర‌పున అచ్చ వేయ‌ద‌ల్చుకున్న సాయుధ‌ శాంతి స్వ‌ప్నం పుస్త‌కానికి ప్రచురణకర్తగా రాసిన ముందుమాట‌) కా. మున్నా అమరుడయ్యాక   ఆర్‌కే నాకు పదే పదే గుర్తుకొచ్చాడు.  శిరీష దు:ఖాన్ని దగ్గరిగా చూశాను కాబట్టి.. ఇప్పుడు ఆర్‌కే మనసు ఎలా ఉంటుంది? అనే ఆలోచన కలిగింది.  ఉద్యమంలో   పని చేసిన రోజుల్లో ఆయన నాకు తెలుసు. ఇప్పుడు    ఈ విషాదంలో ఎలా ఉండి ఉంటాడో అనుకున్నాను. రాంగుడా ఎన్‌కౌంటర్‌లో మున్నాతోపాటు మరో ముప్పై ఒక్క మంది అమరులయ్యారు. ఇంత మంది దుఃఖాన్ని ఆయన మోయాల్సి వచ్చింది కదా అనిపించింది.                 కుటుంబ వ్యవస్థలో నాది
వ్యాసాలు

రోనా: జన హృదయాల్లోనిప్రతిఘటనా స్వరం

బి‌కె -16  కేసులో కటకటాల వెనుక ఉన్న కార్యకర్త రోనా విల్సన్ క్రియాశీలత ఫాసిస్టు  రాజ్యాన్ని      లక్ష్యంగా చేసుకొంది. కేరళలోని కొల్లంలో పెరిగి, 1990 ల ప్రారంభంలో న్యూఢిల్లీకి వెళ్ళిన రోనా తన అరెస్టు వరకు తన జీవితాన్ని అక్కడే గడిపాడు. దక్షిణ ఢిల్లీలోని మునీర్కా గ్రామంలో అద్దెకు తీసుకున్న ఒక గదిలో పూనే, ఢిల్లీ పోలీసుల సంయుక్త చర్యలో రోనాను అరెస్టు చేశారు. జంతుశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పొందిన తరువాత, రోనా తాను  కృషి చేయాల్సింది ఆ రంగం కాదని గ్రహించి, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌లో తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి